Site icon HashtagU Telugu

Aston Martin: బ్రిటీష్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్.. ఈ కార్ స్పీడ్ తెలిస్తే వావ్ అవ్వాల్సిందే?

British Brand Aston Martin

British Brand Aston Martin

లగ్జరీ బ్రిటిష్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ కొత్త V12 వాంటేజ్ రోడ్‌స్టర్ కార్ ను పరిచయం చేసింది. ఈ కారు బేసిక్ గా వాంటేజ్ రోడ్‌స్టర్, కానీ ఈసారి కంపెనీ దీనిని వి12 పవర్‌ ట్రెయిన్‌ తో అందిస్తున్నారు. అయితే రోడ్‌స్టర్ బాడీ స్టయిల్ అంటే రూఫ్‌లెస్ డిజైన్ కారణంగా రైడర్‌లు వి12 ఇంజిన్ సౌండ్‌ని మరింత ఎక్కువగా వినగలుగుతారట. అయితే V12 వింటేజ్ రోడ్ స్టర్ ని మొత్తం 249 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు తాజాగా కంపెనీ వెల్లడించింది. కాగా V12 వాంటేజ్ రోడ్‌స్టర్ ఉత్పత్తి 2022 మూడవ త్రైమాసికంలో ప్రారంభం కానుందట.

అలాగే మొదటి డెలివరీలు Q4 2022లో మొదలుకానున్నాయి. ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ V12 ఇంజన్ 5.2 లీటర్ల సామర్థ్యం ఉండడంతోపాటు, ట్విన్ టర్బోచార్జ్ కూడా చేయబడింది. కాగా ఈ ఇంజన్ 6,500 ఆర్పిఎం వద్ద 700 పిఎస్ గరిష్ట శక్తిని, 5,500 ఆర్పిఎం వద్ద 753 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ZF నుండి తీసుకున్న 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇంజన్ ఫ్రంట్ మిడ్ మౌంట్ చేయబడి, పవర్ ను వెనుక చక్రాలకు ట్రాన్సఫర్ చేయబడుతుంది.

ఈ కారుకి సాధారణ వాంటేజ్ లో ఉపయోగించే అదే సస్పెన్షన్ హార్డ్‌వేర్‌ ను పొందుతుంది, కానీ కంపెనీ రి ట్యూన్ చేసింది. V12 Vantage అల్లాయ్ వీల్స్ 21-అంగుళాలు, ఇంకా పైలట్ 4S హై-పర్ఫర్మెంస్ గల టైర్లను స్టాండర్డ్ గా పొందుతాయి. వీటి సైజ్ ముందు టైర్ 275/35 R21 అండ్ వెనుక టైర్ 315/30 R21.  కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్ కారు బరువును 7.2 కిలోల వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా 7.3 కిలోల బరువును తగ్గించడంలో సహాయపడే కొత్త సీట్లను కూడా పొందుతుంది.