Site icon HashtagU Telugu

BMW Electric: బీఎండబ్ల్యూ నుంచి ఈవీ కారు…ధర ఎంతంటే..!!

BMW Models

BMW Models

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. జనాలు ఈవీల వైపే మొగ్గు చూపుతుండటంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలతో ఎంట్రీ ఇస్తున్నాయి. కేంద్ర ప్రభత్వం ప్రోత్సాహంతో పర్యావరణానికి అనుకూలమైన ఈవీ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. అందులో భాగంగా ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ బీఎండబ్ల్యూ పూర్తి ఎలక్ట్రిక్ కారు ఐ4 సెడాన్ను భారత మార్కెట్లోకి గురువారం రిలీజ్ చేసింది. దీని ధర ఢిల్లీ ఎక్స్ షోరూమ్ రూ. 69.90లక్షలు.

ఐఎక్స్ పేరుతో గతేడాది ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసిన తర్వాత సంస్థ తీసుకొచ్చిన రెండో మోడల్ ఇది. ఈ డ్రైవ్ 40, ఎం 50ఎక్స్ డ్రైవ్ అనే రెండు వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఇది అచ్చం బీఎండబ్ల్యూ 4సిరీస్ గ్రాన్ కూప్ మాదిరిగానే ఉంటుంది. గ్రాన్ క్రూప్ ను పూర్తి ఎలక్ట్రిక్ కారుగా మార్చినట్లు అనిపిస్తుంది.

83.9కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో ఇది పనిచేయనుంది. ఇందులో డ్రైవ్ 40ఒక్కసారిగా ఛార్జింగ్ చేసినట్లయితే 521 కిలీమీటర్లు పరుగెడుతుంది. సున్నా నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలోనే అందుకోవచ్చని సంస్థ ప్రకటించింది. ఎం50 ఎక్స్ డ్రైవ్ ఏడబ్ల్యూడీ స్పోర్టీగా ఉంటుంది. రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 590 కిలోమీటర్ల మేర ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Exit mobile version