Site icon HashtagU Telugu

BMW Bikes : ‘బీఎండబ్ల్యూ మోటారాడ్’, ‘రీవోల్ట్’ కంపెనీల నుంచి సరికొత్త బైక్స్

Bmw Motorrad Bmw Motorcycles Bmw Bikes

BMW Bikes : బీఎండబ్ల్యూ మోటారాడ్ కంపెనీ నుంచి రెండు పవర్ ఫుల్ బైక్స్ రిలీజ్ అయ్యాయి. వాటిలో  ఒక మోడల్ పేరు ‘F900 GS’, మరో మోడల్ పేరు ‘F900 GS అడ్వెంచర్’. వీటిలో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్స్‌లో 895 సీసీ లిక్విడ్-కూల్డ్ ట్విన్- సిలిండర్ ఇంజిన్​ ఉంది. గత నెల నుంచే వీటి బుక్సింగ్స్ ప్రక్రియ మొదలైంది. వీటిలో ఎల్‌ఈడీ లైటింగ్‌తో పాటు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్ కనెక్టివిటీ, 6 స్పీడ్ గేర్‌బాక్స్​లు ఈ బైక్స్‌లో(BMW Bikes) ఉన్నాయి. రెండు కలర్స్‌లో ఈ బైకులు లభిస్తాయి.

Also Read :Anil Ambani : అనిల్ అంబానీకి మంచిరోజులు.. రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరుకు రెక్కలు

బీఎండబ్ల్యూ ఎఫ్900 జీఎస్ మోడల్‌కు చెందిన బైక్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. సావో పాలో ఎల్లో సాలిడ్ పెయింట్‌, లైట్ వైట్ సాలిడ్ పెయింట్‌ కలర్స్‌లో ఇది లభిస్తుంది.  బీఎండబ్ల్యూ ఎఫ్900 జీఎస్ అడ్వెంచర్ బైక్ అనేది బ్లాక్ స్టార్మ్ మెటాలిక్, మ్యాట్ వైట్ అల్యూమినియం రంగుల్లో లభిస్తుంది.  బీఎండబ్ల్యూ ఎఫ్900 జీఎస్ బైక్ ధర రూ.13.75 లక్షలు. బీఎండబ్ల్యూ  ఎఫ్900 జీఎస్ అడ్వెంచర్ బైక్ ధర రూ.14.75 లక్షలు.  ఈ బైకులు 800-900 cc విభాగంలో ట్రయంఫ్ టైగర్ 900, సుజుకి V-Strom 800 DE వంటి బైక్స్‌తో పోటీపడుతుంది. ఈ బైక్స్​లో 23 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, మెరుగైన సస్పెన్స్ ఉన్నాయి.

Also Read :Chandrayaan 4 : చంద్రయాన్‌-4కు కేంద్రం పచ్చజెండా.. ఈసారి ఏం చేస్తారంటే.. ?

రీవోల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్

రీవోల్ట్ మోటార్స్ కంపెనీ నుంచి ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. దాని పేరు రీవోల్ట్ ఆర్‌వీ1. ఇది ఆర్‌వీ1, ఆర్‌వీ1 ప్లస్ అనే  రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు వరుసగా రూ. 84,990, రూ. 99,990. పెట్రోల్ బైక్ నడపడానికి అవసరమయ్యే ఖర్చులో 5శాతంతో ఈ ఈ-బైక్ నడపొచ్చు. అంటే 95శాతం రన్నింగ్ కాస్ట్ మిగులుతుంది. ఈ కొత్త బైకులో ఎలక్ట్రిక్ బైక్ మిడ్-మోటార్, చైన్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ బైక్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. ఒక దాని కెపాసిటీ 2.2కేడబ్ల్యూహెచ్. ఇది 100కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మరొకటి 3.24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. అది 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఆర్‌వీ1 ప్లస్ లో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది కేవలం 1.5 గంటల్లో బ్యాటరీని చార్జ్ చేస్తుంది. దీని పేలోడ్ సామర్థ్యం 250 కిలోలుగా ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 75కిలోమీటర్లు. వీటి బుకింగ్స్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. రూ. 499 చెల్లించి ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభించనున్నారు.

Exit mobile version