Site icon HashtagU Telugu

BMW CE02: టెస్టింగ్ దశలో బీఎండబ్ల్యూ ఈవీ బైక్‌.. భారత్ లోకి విడుదల అయ్యేది అప్పుడే?

Mixcollage 22 Jan 2024 02 24 Pm 1283

Mixcollage 22 Jan 2024 02 24 Pm 1283

ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల క్రేజ్‌ బాగా పెరిగింది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీ వాహనాలను వాడడానికి ఇష్టపడుతుండడంతో వీటి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. దీంతో టాప్‌ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ అన్ని ఈవీ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే లగ్జరీ బైక్‌ కంపెనీలు మాత్రం ఈవీ వాహనాల రిలీజ్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ కంపెనీ రిలీజ్‌ చేసే తమ బైక్స్‌పై ప్రత్యేకంగా ఆసక్తి చూపుతారు.

అయితే తాజాగా బీఎండబ్ల్యూ సీఈ02 గురించి ఒక వార్త ప్రస్తుతం హల్‌చల్ చేస్తుంది. బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో మరోసారి పరీక్షించారు. బెంగుళూరు సమీపంలో టెస్ట్ మ్యూల్‌ని కొంత ఔత్సాహికులు స్పాట్‌ చేశారు. మరి బైక్ కి సంబంధించిన మరిన్ని వివరాల విషయానికొస్తే.. బయటకు వచ్చిన ఫొటోను బట్టి బీఎండబ్ల్యూ సీఈ 02 చాలా సులభమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. పూర్తి పరిమాణ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పోలిస్తే దీని టెస్ట్ మాడ్యూల్‌ నిష్పత్తిలో చిన్నదిగా కనిపిస్తుంది. ఈ స్కూటర్‌ ఎల్‌ఈడీ లైట్లతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ స్కూటర​ బ్యాటరీతో ఫ్లాట్ సీటు, దిగువ మోటార్ ప్లేస్‌మెంట్‌ను పొందుతుంది. సీఈ 02 ఎల్‌ఈడీ లైటింగ్, రివర్స్ గేర్, కీలెస్ ఆపరేషన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, 3.5 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్, ఏబీఎస్‌ వంటి ఫీచర్లను బీఎండబ్ల్యూ అందిస్తుంది. బీఎండబ్ల్యూ సీఈ 02 2 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో పవర్‌ పొందుతుంది. ఈ స్కూటర్‌ సింగిల్ లేదా డ్యూయల్ బ్యాటరీ సెటప్‌తో వస్తుంది. ఈ స్కూటర్ 90 కిమీ పరిధిని అందిస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 95 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందించే అవకాశం ఉంది. ఇది యూఎస్‌డీ ఫోర్క్‌లు, సర్దుబాటు చేయగల వెనుక షాక్‌లపై రైడ్ చేస్తుంది. 220 ఎంఎం వెనుక డిస్క్‌తో 239 ఎంఎం ఫ్రంట్ డిస్క్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ అందరినీ ఆకర్షిస్తుంది. అయితే ఈ స్కూటర్‌ రాబోయే నెలల్లో భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉంది.