Site icon HashtagU Telugu

BMW Electric Scooter: రివర్స్ గేర్ ఆప్షన్ తో బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Bmw Electric Scooter

Bmw Electric Scooter

మామూలుగా రివర్స్ గేర్ అంటే కారు అంతకంటే హెవీ వెహికల్స్ కి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. కార్లు బస్సులు లారీలు, ఆటోలు ఇలా చాలా వాటికి రివర్స్ గేర్ అనేది ఉంటుంది. కానీ రివర్స్ గేర్ కలిగిన బైక్లు మార్కెట్లోకి ఇప్పటివరకు ఏవి విడుదల కాలేదు. అలాంటి బైక్స్ కూడా మార్కెట్లో లేవని చెప్పాలి. కానీ మొదటిసారి రివర్స్ గేర్ ఆప్షన్స్ కలిగిన ఒక ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? దాని ప్రత్యేకతలు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 1న బీఎండబ్ల్యూ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సిఈ 02ని విడుదల చేయడం దాదాపు ఖాయమైంది.

కొత్త బీఎండబ్ల్యూ సిఈ 02 స్కూటీ టీవీఎస్ మోటార్ కంపెనీ సహకారంతో ఇండియాలో తయారు చేశారు. అయితే బీఎండబ్ల్యూ కొన్ని వారాల క్రితం భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం సీఈ 04 ను విడుదల చేసింది. ఇప్పుడు కొన్ని వారాల తర్వాత మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీనితో లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ భారతదేశంలో తన కొత్త వాహనాల అమ్మకాలను పెంచుకునే ఆలోచనలో ఉంది. బీఎండబ్ల్యూ సీఈ 02 అంచనా ధర  ఈ స్కూటీ ధర గురించి ఇంకా కచ్చితమైన సమాచారం లేదు. కానీ ఈ మోడల్ భారతదేశంలో తయారు చేశారు. దీని ధర రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. అనేక ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇది చాలా ఖరీదైనది అని చెప్పాలి.

మరి అత్యధిక ధర కలిగిన ఈ స్కూటర్ ఫీచర్లు ఏంటి అన్న విషయానికి వస్తే.. కొత్త బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్, మోటార్ సైకిల్ రెండింటినీ కలిపి రూపొందించారు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించినట్టుగా ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తుంది. ఇది తక్కువ బాడీ ప్యానెల్స్, ఫ్లాట్ సీటు, ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్‌తో ఉంటుంది. 239 mm ఫ్రంట్, 220 mm వెనుక డిస్క్ బ్రేక్‌లు, ముందువైపు USD ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్, వైడ్ ఆస్పెక్ట్ 14 అంగుళాల వీల్ సెటప్‌తో సహా ప్రీమియం హార్డ్‌వేర్‌ ను కలిగి ఉంది. బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్ PMS ఎయిర్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటారుతో ఆధారితం, రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. kw, 4kW, 4 kW వెర్షన్ గరిష్టంగా 45 kmph వేగాన్ని కలిగి ఉంది. అయితే 11 kW వెర్షన్ 95 kmph గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇది ఒకే ఛార్జ్‌ పై 45 కిలో మీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. కావాలంటే మరొక 2kW బ్యాటరీని జోడించే ఆప్షన్ కూడా పొందవచ్చు. ఈ రెండూ మీకు ఒకే ఛార్జ్‌పై 90km రేంజ్ ఇస్తాయని అంటున్నారు. బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్‌లో కనెక్టివిటీ ఎంపికలతో కూడిన 3.5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే అమర్చారు. మీరు సర్ఫ్, ఫ్లో అనే రెండు రైడింగ్ మోడ్‌లను కూడా పొందుతారు. LED లైటింగ్, USB ఛార్జింగ్, రివర్స్ గేర్‌లాంటి మరెన్నో ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయట. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.