Site icon HashtagU Telugu

BMW CE 04 Electric Scooter: మార్కెట్లోకి రాబోతున్న బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్.. లాంచింగ్ డేట్ ఫిక్స్?

Mixcollage 21 Jul 2024 11 18 Am 2033

Mixcollage 21 Jul 2024 11 18 Am 2033

బీఎండబ్ల్యూ.. కార్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్కెట్లో ఉన్న అత్యంత లగ్జరీ బ్రాండ్ లలో బీఎండబ్ల్యూ కూడా ఒకటి. ముఖ్యంగా లగ్జరీ కార్లకు ఈ కంపెనీ బాగా ప్రసిద్ధిగాంచిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటివరకు మంచి మంచి లగ్జరీ కార్లలో విడుదల చేసిన బీఎండబ్ల్యూ సంస్థ ఇప్పుడు మొట్టమొదటిసారి మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వేరియంట్ లో ఒక స్కూటర్ ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఈ కంపెనీ తీసుకువచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ గా రికార్డులకు ఎక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా దీని ధర దాదాపుగా రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ డేట్ ని ఫిక్స్ చేసింది బీఎండబ్ల్యూ. బీఎండబ్ల్యూ సీఈ04 పేరుతో 2024, జూలై 24న దీనిని మన దేశంలో లాంచ్ చేయనున్నట్లు బీఎండబ్ల్యూ మోటోరాడ్ వెల్లడించింది. ఈ జర్మన్ బ్రాండ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత బీఎండబ్ల్యూ మోటోరాడ్ డీలర్‌షిప్‌లలో సీఈ 04 కోసం ప్రీ లాంచ్ బుకింగ్‌ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇకపోతే త్వరలో విడుదల కాబోతున్న ఈ ఈవీ స్కూటర్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. బీఎండబ్ల్యూ సీఈ04 అత్యాధునిక సాంకేతికతతో విలక్షణమైన డిజైన్ లో వస్తోంది. ఫ్లాట్ హ్యాండిల్‌ బార్, సరికొత్తగా బాడీవర్క్, ఎల్ఈడీ లైటింగ్ ఒక ప్రత్యేకమైన సిల్హౌట్‌ ను సృష్టిస్తాయి. అలాగే ఇది ఖచ్చితంగా కొత్త ట్రెండ్ ను సృష్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ స్కూటర్ మొత్తం రూపం బీఎండబ్ల్యూ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబిస్తూ, ఫంక్షన్,ఫారమ్‌ ల సంపూర్ణ సమ్మేళనంగా కనిపిస్తోంది. కాగా బీఎండబ్ల్యూ సీఈ04 ఫీచర్ల విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ సీఈ04 రైడర్ సౌకర్యం, భద్రత రెండింటినీ మెరుగుపరిచే ఫీచర్లతో లోడ్ చేసి ఉంటుంది. ఒక పెద్ద ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లే రైడర్ కు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీని కూడా అందిస్తుంది. ఈ స్కూటర్‌ లో ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి అధునాతన రైడర్ సౌకర్యాలను అందిస్తోంది. ఇది మంచి పనితీరును నిర్ధారిస్తుంది.

ఎర్గోనామిక్ డిజైన్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ రద్దీగా ఉండే పట్టణ పరిసరాలలో కూడా రిలాక్స్డ్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 42 బీహెచ్పీ 62 ఎన్ఎం టార్క్‌ ను విడుదల చేసే లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ను కూడా అందిస్తుంది. ఇది 8.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ మంచి పరిధిని నిర్ధారిస్తుంది. పనితీరు విషయానికి వస్తే.. సీఈ 04 గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగుతుంది. అలాగే 0 50 మైళ్ల వేగాన్ని కేవలం 2.6 సెకన్లలో అందుకుంటుంది. దీనిలో మూడు రైడ్ మోడల్‌ లు ఉన్నాయి. ఎకో, రెయిన్, రోడ్ వీటితో రైడర్ కు వెసులుబాటు కలుగుతుంది.

Exit mobile version