BMW 7: దుమ్మురేపే ఫీచర్లతో అదరగొడుతున్న బీఎండబ్యూ కార్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బీఎండబ్యూ.. ఈ పేరు వినగానే కొంతమంది వాహన వినియోగదారులు భయపడుతూ ఉంటారు. అందుకు గల కారణం ఆ వాహనాలు దరలే. బీఎండబ్యూ కార్ల ధరలు ఎక్కు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 13 Feb 2024 05 37 Pm 5834

Mixcollage 13 Feb 2024 05 37 Pm 5834

బీఎండబ్యూ.. ఈ పేరు వినగానే కొంతమంది వాహన వినియోగదారులు భయపడుతూ ఉంటారు. అందుకు గల కారణం ఆ వాహనాలు దరలే. బీఎండబ్యూ కార్ల ధరలు ఎక్కువగా కోట్లలో ఉంటాయి. దాంతో చాల వరకు వినియోగదారులు ఈ బిఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేయడానికి భయపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఈ కారు ధర ఎంత ఉన్నప్పటికీ కార్ల కొనుగోలుదారుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇకపోతే బీఎండబ్యూ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది.

ఇది ఇలా ఉంటే తాజాగా BMW కంపెనీ తన 7 Series ప్రొటెక్షన్ కారును ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త సెడాన్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర దాదాపుగా రూ.1,81,50,000 గా తెలిపారు. ఈ కారు లీటర్ కి 16.55 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో పెట్రోల్, డీజిల్ వేరియంట్లు ఉన్నాయి. మొత్తం 5 కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది. ఈ కారు యొక్క ఇంటీరియర్ అద్భుతంగా ఉంటుందని తెలిపారు. అలాగే దీని క్రిస్టల్ హెడ్‌లైట్ ఐకానిక్ గ్లో ఇస్తుందని తెలిపారు. దీనికి మెరిసే కిడ్నీ గ్రిల్ ఉంటుంది.

అలాగే లోపల 31.3 అంగుళాల 8K రిజల్యూషన్ థియేటర్ స్క్రీన్ ఉంటుంది. అలాగే అమెజాన్ ఫైర్ టీవీని ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో సెట్ చేశారు. ఈ కారు పెట్రోల్ ఇంజిన్ 280 kw (381 hp) పవర్ కలిగివుంది. ఇది 5.4 సెకండ్లలో గంటకు జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ సెడాన్లో రెండు 5.5 అంగుళాల టచ్ స్క్రీన్లు ఉంటాయి. అలాగే ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్, సీట్ సెట్టింగ్స్ ఉన్నాయి. లోపల 4D ఆడియో ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తున్నారు. ఈ కారును EMIలో కూడా పొందే వీలుంది. నెలకు రూ.1,77,777గా ఫిక్స్ చేశారు. BMW 7 సిరీస్ ప్రొటెక్షన్ కారు. కాగా ఈ కారు కేవలం ధర విషయంలో మాత్రమే కాకుండా ఫీచర్స్ విషయంలో కూడా అదుర్స్ అనిపిస్తోంది.

  Last Updated: 13 Feb 2024, 05:38 PM IST