Site icon HashtagU Telugu

Bikes: యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టంతో వస్తున్న బైక్స్.. ఇవి చాలా సేఫ్ గురు?

Mixcollage 30 Jun 2024 06 30 Pm 3215

Mixcollage 30 Jun 2024 06 30 Pm 3215

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజురోజుకీ టూ వీలర్స్ వాడకం గణనీయంగా పెరుగుతూనే ఉంది. వాహన తయరీ సంస్థలు కూడా వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైక్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మంచి మంచి ఫీచర్లు మైలేజీ, రేంజ్ అందించే బైక్‌ లతో పాటు సేఫ్టీకి అధిక ప్రాధాన్యతను ఇచ్చే బైక్ కంపెనీలను కస్టమర్లు ఎంచుకుంటున్నారు. మారిన టెక్నాలజీకి అనుగుణంగా బైకు ఉత్పత్తి సంస్థలు కూడా అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి సేఫ్టీ ఫీచర్లను జోడిస్తున్నాయి. ఇక్కడే మీకు బైక్స్‌లో సేఫ్టీ ఏంటి అనే ప్రశ్న తలెత్తవచ్చు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం అనేది బైక్స్‌లో చాలా కీలకం. అయితే చాలా మోటార్ సైకిళ్లలో ఈ వ్యవస్థ ప్రామాణికంగా అందిచనప్పటికీ ఏబీఎస్ వ్యవస్థను కొన్ని మోటార్ సైకిళ్లలో అందిస్తున్నారు. ఏబీఎస్ ఛానల్‌ అనేదీ సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. సింగిల్‌ ఛానల్‌ కేవలం ముందు చక్రానికి మాత్రమే సేఫ్టీని అందిస్తుంది. డ్యూయల్‌ ఛానల్‌ వెనుక చక్రాలకు భద్రతను కూడా అందిస్తుంది. మరి అటువంటి వాటిలో భారత్లో ఉన్న టాప్ ఫైవ్ బైక్స్ ఏవో తెలుసుకుందాం..

బజాజ్ పల్సర్ NS 160.. బజాజ్ పల్సర్ NS 160 డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో లభించే అత్యంత సరసమైన బైక్‌గా ఉంది. దీని ధర రూ .1.37 లక్షలు గా ఉంది. ఇందులోని 160సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 17.03bhp పవర్ 14.6nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది.

బజాజ్ పల్సర్ N 160.. ఈ బజాజ్ పల్సర్ N 160 బైక్ కూడా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. దీని ధర రూ.1.32 లక్షలుగా ఉంది. ఈ బైక్ 164.82 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 15.7bhp పవర్ 14.65nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్‌ కూడా 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది.

అదేవిధంగా టీవీఎస్ అపాచీ RTR 200 4V డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. దీని ధర రూ.1.49 లక్షలుగా ఉంది. ఈ బైక్ 197.75 సీసీ సింగిల్ సిలిండర్, 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 20.2bhp శక్తి 16.8nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్‌ ఆప్షన్‌ ఉంది.

బజాజ్ పల్సర్ N 250/ F250…పల్సర్ N250 F 250 కూడా డ్యూయల్‌ ఏబీఎస్‌ ఛానల్‌ని కలిగి ఉన్నాయి. దీని ధర రూ .1.51 లక్షలుగా ఉంది. ఈ మోటార్ సైకిళ్లలో 249 సిసి సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఇది 24.1 bhpపవర్ 21.5 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ జతచేయబడి ఉంటుంది.

బజాజ్ పల్సర్ NS 200.. ఇకపోతే చివరగా డ్యూయల్‌ ఏబీఎస్‌తో వచ్చే బజాజ్ పల్సర్ NS 200 ధర రూ .150 లక్షలుగా ఉంది. పల్సర్ NS 200 బైక్‌లో 199 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఈ ఇంజిన్ గరిష్టంగా 24.13bhp పవర్ మరియు 18.74nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.