Site icon HashtagU Telugu

Discount offer on Cars: ఫిబ్రవరిలో ఈ కార్లపై భారీగా డిస్కౌంట్.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే?

Mixcollage 09 Feb 2024 04 58 Pm 926

Mixcollage 09 Feb 2024 04 58 Pm 926

ఈ ఏడాది మొదలైన తర్వాత చాలా వరకు కార్ల తయారీ సంస్థలు వాటి కార్లపై ధరలను విపరీతంగా పెంచేసిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది డిసెంబర్లో కార్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటించిన కొన్ని సంస్థలు ఈ ఏడాది పూర్తిగా పెంచేసాయి. అటువంటి సమయంలోనే మరికొన్ని కంపెనీలు అమ్మకాలను పెంచుకోవడం కోసం MY2023 స్టాక్‌ను క్లియర్ చేయడానికి ప్రముఖ కార్ కంపెనీలు కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

వీటిలో మహీంద్రా, మారుతీ, హుందాయ్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ నెలలో ఎక్స్ యూవీ 300,ఎక్స్ యూవీ 400 పై భారీ తగ్గింపును ఇస్తోంది మహీంద్రా. మారుతి కూడా తన నెక్సా ఎరినా కార్లపై 1.50 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ రెండు కంపెనీలు కాదు హ్యుందాయ్, హోండా కూడా తమ కార్లపై డిస్కౌంట్లను ఇస్తున్నాయి. మరి ఏ ఏ కంపెనీ వాటి కార్లపై ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తోంది న్న వివరాల్లోకి వెళితే.. 2023 మహీంద్రా బొలెరోపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ ఆఫర్‌ లు ఉన్నాయి. 2023 హ్యుందాయ్ వెర్నాపై రూ. 55,000 వరకు బెనిఫిట్ ఆఫర్స్ అందిస్తున్నారు.

2023 హ్యుందాయ్ అల్కాజార్‌పై రూ. 45,000 వరకు ఆఫర్స్ ఇస్తున్నారు. 2023 మహీంద్రా XUV300పై రూ. 1.82 లక్షల వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి. 2023 మహీంద్రా XUV400పై రూ. 4.2 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. 2023 మారుతి గ్రాండ్ విటారాపై రూ. 75,000 వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి. 2023 మారుతీ జిమ్నీపై రూ. 1.50 లక్షల వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి. 2023 మారుతీ ఫ్రాంక్స్‌పై రూ. 83,000 వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి. మారుతీ అల్టో కే10పై రూ. 62,000 వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి. S-Presso మరియు Wagon R పై రూ. 61,000 వరకు డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి. హోండా సిటీపై రూ. 1.11 లక్షల వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి. హోండా అమేజ్‌పై రూ. 92,000 వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి.