Safety Car: ఆ విషయంలో తగ్గేదేలే అంటూ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన టాటా నెక్సాన్?

మామూలుగా మనం కొత్త కారుని కొనుగోలు చేసేటప్పుడు ముందుగా అందులో ఫీచర్ల గురించి, బాధ్యత విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. లాంగ్ జర్నీ

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 02:17 PM IST

మామూలుగా మనం కొత్త కారుని కొనుగోలు చేసేటప్పుడు ముందుగా అందులో ఫీచర్ల గురించి, బాధ్యత విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. లాంగ్ జర్నీలకు ఎక్కువగా వెళ్లేవారు ముఖ్యంగా భద్రతకు పెద్ద పీట వేస్తుంటారు. ఇందులో భాగంగానే కారు బ్రేకింగ్ సిస్టమ్‌, ఎయిర్‌ బ్యాగ్స్‌తోపాటు క్రాష్‌ టెస్ట్‌లో కారు సాధించిన ర్యాంకింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. అందుకే ఏ కారైనా సేఫ్టీ ర్యాంకింగ్‌ను దాటుకొని మార్కెట్లోకి రావాల్సిందే. దీనినే క్రాష్‌ టెస్ట్ అంటారు. అందుకే మార్కెట్లోకి వచ్చే ముందు కారును క్రాష్‌ టెస్ట్ చేస్తారు. ఇందులో టాప్‌లో నిలిచిన కారును ప్రకటిస్తుంటారు.

అయితే అలా తాజాగా నిర్వహించిన ఈ క్రాష్‌ టెస్ట్‌లో గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్స్ GNCAP టాటా నెక్సాన్‌ను బెస్ట్ ఈవీ ఎస్‌యూవీగా ప్రకటించింది. ఈ కారుకు ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం విశేషం అనే చెప్పాలి. టాటా నెక్సాన్ ఈవీ ఎస్‌యూవీకు పెద్దల విషయంలో 30 పాయింట్లకు 29.86 ఇచ్చింది. ఇక పిల్లల ఆక్సుపెన్సీ సేఫ్టీ విషంయోల 49 పాయింట్లకు 44.95 ఇచ్చింది. దీంతో ఈ కారుకు భద్రత విషయంలో 5 స్టార్‌ రేటింగ్ లభించింది. 18 ఏళ్ల పిల్లల సేఫ్టీ విషంయలో 12 పాయింట్లకు 11.95 వచ్చాయి. మూడేళ్ల పిల్లల విషయంలో 12 కు 12 పాయింట్లు లభించాయి.

అలాగే ఒకవేళ ప్రమాదం జరిగితే ముందు కూర్చునే వాళ్లను ప్రమాదం నుంచి ఏ మేరకు కాపాడవచ్చో తెలిపేందుకు నిర్వహించే సైడ్ పోల్, ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా ఈకారుకు మంచి స్కోర్ దక్కింది. ఇందులో 16 పాయింట్లకు 14.26 దక్కాయి. ఇది గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు చేసిన పరీక్ష. అలా ఈ పరీక్షల్లో విజయం సాధించి టాప్ వన్ లో నిలిచింది.