2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండో రోజు పలు ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీలు కొత్త కొత్త మోడల్ వాహనాలను ప్రదర్శిస్తున్నారు. ఎలక్ట్రిక్ నుంచి సాధారణ వాహనాల వరకు ఎన్నో ఆకర్షణీయమైన మోడళ్లను ప్రదర్శిస్తున్నారు. మొబిలిటీ రంగంలో వచ్చిన అనేకమైన కొత్త కొత్త సాంకేతికలను జోడించిన వాహనాలను ప్రముఖ కంపెనీలు ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధునాతన ఎలక్ట్రిక్ త్రీ వీలర్, మైక్రో ఫోర్ వీలర్ కాన్సెప్ట్ మోడల్ లను ఆవిష్కరించింది.
కాగా ఈ మేరకు దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ మోటార్ కంపెనీ హ్యుందాయ్ తాజాగా శనివారం టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భారత మొబిలిటీ మార్కెట్ లోకి కీలక ఆవిష్కరణలను ప్రవేశపెట్టడానికి టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ జతకట్టింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 లో హ్యుందాయ్ అధునాతన ఎలక్ట్రిక్ త్రీ వీలర్, మైక్రో ఫోర్ వీలర్ కాన్సెప్ట్ మోడల్ లను ఆవిష్కరించింది. అంతకుముందు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును కూడా ప్రదర్శించింది. హ్యుందాయ్.. మోటార్ డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతికతను అందించే సామర్థ్యాన్ని అన్వేషిస్తోంది. దీనికోసం టీవీఎస్ మోటార్ వాహనాల తయారీ, మార్కెటింగ్ తో ముందుకు కలిసి ప్రయాణించనుంది.
టీవీఎస్ మోటార్ తో కలిసి నాలుగు చక్రాల కోసం ప్రపంచ అవకాశాలను అన్వేషిస్తూ త్వరితగతిన ఆవిష్కరణలు చేస్తున్న ఇండియా స్ఫూర్తితో సహజమైన కార్యాచరణను మిళితం చేస్తూ, స్థానికంగా మూడు చక్రాల వాహనాన్ని ఉత్పత్తి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని హ్యుందాయ్ అండ్ జెనెసిస్ గ్లోబల్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హెడ్ సాంగ్యూప్ లీ తెలిపారు. ఈ వినూత్న ఆవిష్కరణలు భారతదేశం డైనమిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ల్యాండ్‌స్కేప్ లో భాగంగా సౌలభ్యం, స్థిరత్వం, అనుకూలతకు ప్రాధాన్యతనిచ్చే మొబిలిటీ సొల్యూషన్ లను పునర్నిర్మించడం ద్వారా ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ దృష్టికి హ్యుందాయ్ మోటార్ అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతుందని అన్నారు. హ్యుందాయ్ మోటార్ అనేది కస్టమర్ సెంట్రిక్ బ్రాండ్, ఇండియాలోని ప్రజల పట్ల శ్రద్ధ వహించడం మా మొదటి లక్ష్యం. ఈ నిబద్ధత భారతదేశ విశిష్ట వాతావరణానికి అనుగుణంగా మైక్రో మొబిలిటీ సొల్యూషన్‌ల రూపకల్పనను అన్వేషించడానికి, ఆలోచనాత్మకమైన డిజైన్ ద్వారా చలనశీలత అనుభవాలను మెరుగుపరిచేందుకు ఐకానిక్ త్రీ-వీలర్‌ను పునఃరూపకల్పన చేయడానికి మమ్మల్ని పురికొల్పింది అని లీ తెలిపారు.