Site icon HashtagU Telugu

CNG: చలికాలంలో సీఎన్‌జీ కార్ తక్కువ మైలేజ్ ఇస్తోందా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Cng

Cng

మాములుగా సీఎన్‌జీ కార్లు వినియోగించే చాలామంది చెప్పు ఏ ప్రాబ్లం మైలేజ్ ఎక్కువగా రావడం లేదు. ముఖ్యంగా చలికాలంలో మైలేజ్ రావడంలేదని చెబుతుంటారు. అయితే మరి అలాంటప్పుడు మీ సీఎన్‌జీ కారు ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చలికాలంలో సీఎన్‌జీ కార్ల మైలేజ్ తగ్గుతుందని మీరు తరచుగా వినే ఉంటారు. కానీ ఇది వాహనం స్టార్ట్ చేసిన తర్వాత కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వాహనం కదలడం ప్రారంభించినప్పుడు సీఎన్‌జీ దాని ప్రవాహంలోకి వస్తుంది. ఇంజిన్ సజావుగా పని చేస్తుంది. అలాగే మీ కారులో ఇన్‌స్టాల్ చేసిన ఎయిర్ ఫిల్టర్ చాలా మురికిగా లేదా శుభ్రంగా లేకుంటే వెంటనే దానిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఎయిర్ ఫిల్టర్ పాతది అయినప్పటిక మీరు దానిని సమయానికి మార్చాలట.

ఎందుకంటే కారులోని ఎయిర్ ఫిల్టర్ మురికిగా మారితే గాలి ఇంధన మిశ్రమం దహన సమస్య ఏర్పడవచ్చని చెబుతున్నారు. దీంతో ఇంజన్‌ పై ఒత్తిడి పడటమే కాకుండా ఇంధనం కూడా ఖర్చవుతుందట. అందువల్ల, ప్రతి నెలా ఎయిర్ ఫిల్టర్‌ ను శుభ్రపరచడం అవసరం అని చెబుతున్నారు. సీఎన్‌జీ కారు మైలేజీని పెంచడానికి ట్రాన్స్‌మిషన్ ఆయిల్‌ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ఈ పని స్థానికంగా చేయకూడదట. ప్రొఫెషనల్ మెకానిక్ ద్వారా ట్రాన్స్‌మిషన్ ఆయిల్‌ ని తనిఖీ చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలని చెబుతున్నారు. మీరు దీన్ని చేయడంలో ఆలస్యం చేసినా లేదా విస్మరించినా అది మీ కారు ఇంజిన్‌ కు హాని కలిగించవచ్చని చెబుతున్నారు.

సీఎన్‌జీ కార్లకు ఇంజిన్‌ ని మండే ప్రక్రియ కోసం మంచి నాణ్యత గల స్పార్క్ ప్లగ్‌ లు అవసరం. అందువల్ల స్పార్క్ ప్లగ్ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే సీఎన్‌జీ వాహనాల్లో మండటం ఉష్ణోగ్రత పెట్రోల్ కార్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. స్పార్క్ ప్లగ్ సరిగ్గా ఉంటే ఇంజిన్ మంచి స్థితిలో ఉంటుందని చెబుతున్నారు. అలాగే మైలేజ్ కూడా పెరుగుతుందట. శీతాకాలంలో మీ సీఎన్‌జీ కారు పూర్తి సర్వీస్‌ ను పొందాలని నిర్ధారించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ కారు కండీషన్‌ గా ఉంటుందట. స్పార్క్ ప్లగ్ చాలా మురికిగా లేదా చెడిపోయినట్లుగా ఉన్నట్లయితే మీరు దానిని మార్చాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.