New Car: కేవలం రూ. 7 లక్షలకే బెస్ట్ SUV కార్స్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ఇటీవల కార్ల కొనుగోలుదారులు ఎక్కువ శాతం ఉంది బడ్జెట్ రేంజ్ లో మార్కెట్లో ఉన్న కార్లనే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్ట

  • Written By:
  • Publish Date - July 3, 2024 / 07:30 AM IST

ఇటీవల కార్ల కొనుగోలుదారులు ఎక్కువ శాతం ఉంది బడ్జెట్ రేంజ్ లో మార్కెట్లో ఉన్న కార్లనే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీ సంస్థలు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలో ఉండే కార్లనే మార్కెట్ లోకి ఎక్కువగా విడుదల చేస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం రూ.7లక్షల బడ్జెట్‌లో మార్కెట్లో బెస్ట్ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీలు లభిస్తున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. కాగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో టాటా పంచ్ కూడా ఉంది. దీని ధర రూ.6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇండియాలో ఉన్న కొన్ని పాపులర్ హ్యాచ్‌బ్యాక్స్ కంటే దీని ధరే తక్కువ కావడం విశేషం.

టాటా పంచ్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. దీంట్లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 87 bhp పవర్, 115 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, సింగిల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ విభాగంలో ఎలక్ట్రిక్, CNG వెర్షన్లలో లభించే ఏకైక ఎస్‌యూవీ పంచ్ ఒక్కటే. జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ నుంచి వచ్చిన సింగిల్ సబ్-కాంపాక్ట్ SUV ఇది. నిస్సాన్ మాగ్నైట్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో చీపెస్ట్ SUVల్లో ఒకటి. వెహికల్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. మాగ్నైట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ నేచరల్లీ యాస్పైడ్, టర్బో వెర్షన్లలో లభిస్తుంది.

ఈ మోటార్ పవర్ వేరియంట్‌ను బట్టి 71 bhp- 99 bhp మధ్య ఉంటుంది. టార్క్ 96 Nm-150 Nm మధ్య ఉంటుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో పాటు గత సంవత్సరం లాంచ్ అయిన కొత్త CVT ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో కూడా లభిస్తుంది. ఎంట్రీ లెవల్ మాగ్నైట్ కారు డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, సీట్‌బెల్ట్ అలర్ట్, పవర్ విండోస్, సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఎన్నో ఫీచర్లతో వస్తుంది. అదేవిధంగా భారత్ లో హ్యుందాయ్ కంపెనీ నుంచి వచ్చిన అతి చిన్న SUV ఇది. ఈ ఎంట్రీ-లెవల్ SUV ధర రూ.6.13 లక్షలనుంచి రూ.10 లక్షల వరకు ఉంది. ఈ వెహికల్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో పెయిర్ అవుతుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 6 ఎయిర్‌ బ్యాగ్స్‌, సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇతర ఫీచర్లతో వస్తుంది. అలాగే ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్, ఇండియాలో కిగర్ ఎడిషన్‌తో సబ్-కాంపాక్ట్ SUV విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.6లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి అప్‌గ్రేడ్ అవుతూ తక్కువ ధరలో మంచి SUV కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. కిగర్ SUV ఎంట్రీ-లెవల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.6 లక్షలు కాగా, ఆటోమేటిక్ వెర్షన్‌ ధర రూ.10 లక్షల వరకు ఉంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, నిస్సాన్ మాగ్నైట్ లాంటి పవర్, టార్క్ అవుట్‌పుట్స్, అవే ఫీచర్లతో ఇది మార్కెట్లోకి వచ్చింది.