Site icon HashtagU Telugu

Best Mileage Bikes: భారతదేశంలో రూ. లక్షలోపు మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లు ఇవే..!

Hero Splendor Plus

Hero Splendor Plus

Best Mileage Bikes: నేటికీ కార్ల కంటే భారతీయ రోడ్లపై మోటార్ సైకిళ్లు (Best Mileage Bikes), స్కూటర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్. దేశంలో పెట్రోల్ స్కూటర్లు, మోటార్ సైకిళ్ల నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల వరకు ద్విచక్ర వాహనాలను తయారు చేసే అనేక కంపెనీలు ఉన్నాయి. అయితే మనలో చాలా మంది వాహనం కొనుగోలు చేసినప్పుడల్లా మోటార్ సైకిల్ అయినా, కారు అయినా.. ఆ మోడల్ మైలేజీని మనం ముందుగా పరిశీలిస్తాం. అందుకే మీ కోసం ఉత్తమ మైలేజీని ఇచ్చే కొన్ని బైక్‌ల జాబితాను తీసుకువచ్చాము. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

హోండా షైన్ 100

జాబితాలో మొదటి బైక్ గురించి మాట్లాడుకుంటే హోండా షైన్ 100 ఉంటుంది. దీని ధర భారతదేశంలో రూ. 65,011 (ఎక్స్-షోరూమ్). హోండా షైన్ 100లో మీరు లీటరుకు 65 కిమీల బలమైన మైలేజీని పొందుతారు. ఈ బైక్‌లో 98.98సీసీ ఇంజన్ ఉంది. ఇది 7.28 బిహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

హోండా SP 125

జాబితాలో రెండో బైక్ కూడా హోండా కంపెనీదే. ఇందులో హోండా SP 125 ఉంది. ఇది భారతదేశంలో రూ. 86,747 ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే దీని ధర రూ. 91,298 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇంజన్ స్పెక్స్ గురించి చెప్పాలంటే.. బైక్ 124సీసీ ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ మోటార్‌సైకిల్ లీటర్‌కు 65 కిమీ మైలేజీని అందిస్తుంది. 10.72 బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్, 10.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ ప్లాటినా 100

ఈ జాబితాలో మూడవ బైక్ బజాజ్ ప్లాటినా 100. ఇది భారతదేశంలో రూ. 61,617 నుండి రూ. 66,119 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బజాజ్ ప్లాటినా 100లో మీరు లీటర్‌కు 75 కిమీల బలమైన మైలేజీని అందుకుంటున్నారు. బైక్‌లో 102సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది. ఈ బైక్ 7.8బిహెచ్‌పి పవర్, 8.34ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Also Read: Narendra Modi: పీఎం-సూర్యఘర్‌కు కోటికిపైగా రిజిస్ట్రేషన్లు

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్

లిస్ట్‌లోని చివరి బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్. ఇది భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. రూ. 79,705 (ఎక్స్-షోరూమ్) ధరతో మీరు దీన్ని మీ స్వంతం చేసుకోవచ్చు. Hero Splendor Plus Xtecలో మీరు లీటరుకు 60 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని పొందుతారు. ఈ బైక్‌లో శక్తివంతమైన 97.2సీసీ ఇంజన్ అమర్చబడి 7.9 బిహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

TVS స్పోర్ట్

TVS స్పోర్ట్ మైలేజీ పరంగా కూడా ఉత్తమ ఎంపిక. మీరు భారతదేశంలో రూ. 63,301 ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే దీని ధర రూ. 69,090 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. TVS స్పోర్ట్ 80 km/లీటర్ మైలేజీని అందిస్తుంది. 109.7cc ఇంజన్‌తో 8.18 bhp, 8.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.