Site icon HashtagU Telugu

Mileage Bikes: తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే..!

Mileage Bikes

Compressjpeg.online 1280x720 Image 11zon (1)

Mileage Bikes: భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. ప్రజల మొదటి వాహనం మోటార్ సైకిల్. మీరు కూడా మీ కోసం కొత్త బైక్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ రోజు మేము మీ కోసం మార్కెట్లో ఎక్కువ మైలేజీని ఇచ్చే బైక్‌ల (Mileage Bikes) జాబితాను తీసుకువచ్చాం. వాటి ఖరీదు..? వాటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

హీరో స్ప్లెండర్ ప్లస్

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఇది ఒకటి. దీని మైలేజీ కారణంగా ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ బైక్ 30 సంవత్సరాలకు పైగా మార్కెట్లో ఉంది. ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇతర బైక్‌లతో పోటీపడుతోంది. ఇందులో 97.2 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఉంది. ఇది 7.91 bhp శక్తిని, 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 80 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.72,076 నుండి రూ.76,346 వరకు ఉంది.

Also Read: Flight Emergency Landing : ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి దింపిన డైపర్‌

బజాజ్ ప్లాటినా 100

అత్యధిక మైలేజీని ఇచ్చే బైక్‌ల జాబితాలో ఇది కూడా ఒకటి. ఇది కంపెనీకి చెందిన ఎంట్రీ లెవల్ బైక్. ఈ బైక్‌లో 102 సీసీ ఇంజన్ ఉంది. ఇది 7.79 bhp శక్తిని, 8.30 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటరుకు 70 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.65,856.

We’re now on WhatsApp. Click to Join.

TVS రేడియన్

TVS హై పెర్ఫార్మెన్స్ బైక్‌లలో ఇది ఒకటి. ఈ బైక్ మైలేజీ కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ బైక్‌లో 109.7 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలదు. ఇంజన్ 8 bhp శక్తిని, 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటరుకు 70 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.59,925.