Site icon HashtagU Telugu

Best Fuel Efficient Bikes: అధిక మైలేజ్ ఇస్తూ అదరగొడుతున్న బెస్ట్ బైక్స్ ఇవే.. ధర కూడా తక్కువే!

Mixcollage 05 Mar 2024 03 26 Pm 6273

Mixcollage 05 Mar 2024 03 26 Pm 6273

ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనాల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ప్రతి చిన్న పనికి బైకులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉదయాన్నే పాలు పోసే వారి దగ్గర నుంచి కూరగాయలు, పండ్లు విక్రయించే వారందరూ వీటినే ఉపయోగిస్తారు. ఇక ప్రయాణానికి, కొన్ని రకాల సరుకుల రవాణాకు ఇవే ఆధారం. రైతులు కూడా పొలాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ద్విచక్ర వాహనాలపైనే వేరే చోటుకి తరలిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి వారి అవసరాల కోసం బైక్ లను వినియోగిస్తున్నారు. అయితే ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువగా దృష్టిలో పెట్టుకునే అంశం మైలేజ్. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులనే కొనుగోలు చేస్తూ ఉంటారు. అధిక మైలేజీతో నడిచే బైకులను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బైకులలో ఏ బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అన్న విషయంకు వస్తే..

హీరో స్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్.. హీరో స్లెండర్ ప్లస్ ఎక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 79,911 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బండి ఇంజిన్ సామర్థ్యం 97.2 సీసీ. అలాగే 8 బీహెచ్ పీ పవర్ ను, 8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోలుకు 80.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్.. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ధర నుంచి 59,998 నుంచి 68,768 వరకూ పలుకుతుంది. దీని ఇంజిన్ సామర్థ్యం 97.2 సీసీ. 8 బీహెచ్ ప్ పవర్ ను, 8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బండి లీటర్ పెట్రోలుకు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

టీవీఎస్ రైడర్.. టీవీఎస్ రైడర్ 95,219 నుంచి రూ.1.03 లక్షల ధరలో మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీనికి 124.8 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. 11.4 బీహెచ్ పీ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోలుకు 67 కిలోమీటర్లు ఇస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125.. బజాబ్ పల్సర్ రూ. 99,571 ధరలో అందుబాటులో ఉంది. దీని ఇంజిన్ సామర్థ్యం 124.45 సీసీ. 12 బీహెచ్ పీ, 11 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బండి లీటర్ కు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.