ఇటీవల కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే కొనుగోలుదారుల సంఖ్య పెరిగిపోవడంతో వాహన తయారీ సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే అనేక ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ ధరలో ఉండే ఎలక్ట్రిక్ కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరి మీరు కూడా ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే ప్రస్తుతం మార్కెట్ లో బడ్జెట్ ధరకే లభిస్తున్న కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టాటా టియాగో ఈవీ కారు ధర రూ.7.99 లక్షల నుండి రూ.11.89 లక్షల మధ్య ఉంది. ఇది 19.2 KWh, 24 KWh బ్యాటరీని కలిగి ఉంది. ఈ కారుని ఒకసారి ఫుల్ గా ఛార్జింగ్ చేస్తే చాలు 221 నుంచి 225 కి.మీ ప్రయాణించవచ్చు. ఇందులో 5 మంది కూడా వెళ్లవచ్చు. టాటా టియాగో ఈవీ 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ లతో సహా అనేక ఫీచర్ లను అందిస్తోంది. అలాగే ఇది ప్రయాణికులకు గరిష్ట రక్షణను అందించడానికి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ లు, TPMS తో సహా వివిధ భద్రతా లక్షణాలతో వస్తోంది.
అలాగే బడ్జెట్ ధరలో లభిస్తున్న కార్లలో ఎంజీ విండర్స్ ఈవీ కారు కూడా ఒకటి. ఈ కారు ధర రూ. 9.99 లక్షలు గా ఉంది. 38 KWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 331 కి.మీ. రేంజ్ ని ఇస్తుంది. అలాగే ఈ కారులో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఎంజీ విండ్సర్ ఈవీ 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ తో సహా పలు ఫీచర్లతో వస్తుంది. భద్రత పరంగా ఇది 6 ఎయిర్ బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరాను పొందుతుందట..
మరొక బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు ఎంజి కామెట్. ఈ కారు ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.53 లక్షల మధ్య ఉండనుంది. ఇది 17.3 KWh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. దీనిని ఫుల్ ఛార్జింగ్ చేస్తే 230 కిలో మీటర్ల రేంజ్ ని ఇస్తుంది. 7.4 KW ఛార్జర్ ని ఉపయోగించి 0 నుంచి 100 శాతం నుండి ఛార్జ్ చేయడానికి కారు బ్యాటరీ ప్యాక్ కేవలం 3.5 గంటలు పడుతుంది. ఈ ఈవీ కారులో 4గురు వెళ్లవచ్చు. ఇది 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీతో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
అలాగే భారత మార్కెట్ లో బడ్జెట్ ధరలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా పంచ్ ఇవి ఎలక్ట్రిక్ కారు కూడా ఒకటి. ఈ కారు ధర రూ.9.99 లక్షల నుంచి రూ.14.29 లక్షల మధ్య ఉండనుంది. ఇది 25 KWh, 35 సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఎంపికను కలిగి ఉంది. ఈ కార్ ని ఒకసారి చార్జింగ్ చేస్తే చాలు 265 నుంచి 365 కి.మీ ప్రయాణించవచ్చు. ఈ పంచ్ ఈవీలో 5 మంది కూడా ప్రయాణించవచ్చు. ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.