Java: బంపర్ ఆఫర్లను ప్రకటించిన జావా.. బైక్స్ పై భారీగా తగ్గింపు?

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇయర్ ఎండ్ సేల్స్ నడుస్తున్నాయి. అన్ని రకాల కంపెనీలు వాటి ప్రోడక్ట్ లపై భారీగా తగ్గింపు ప్రకటిస్తున్నాయి. ఇందులో

Published By: HashtagU Telugu Desk
Mixcollage 15 Dec 2023 02 09 Pm 1432

Mixcollage 15 Dec 2023 02 09 Pm 1432

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇయర్ ఎండ్ సేల్స్ నడుస్తున్నాయి. అన్ని రకాల కంపెనీలు వాటి ప్రోడక్ట్ లపై భారీగా తగ్గింపు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే కార్లు, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తూ ఆయా సంస్థలు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. 2023 సంవత్సరం ముగియడానికి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో కస్టమర్‌లను ఆకర్షించేందుకు కార్లు, బైక్‌ల విక్రయ సంస్థలు వివిధ ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన కంపెనీ జావా బైక్‌లలోని కొన్ని మోడళ్లపై 10,000 రూపాయల వరకు తగ్గింపును అందించబోతోంది.

మరికొద్ది రోజుల్లో 2023 ముగియనున్న నేపథ్యంలో వివిధ కంపెనీలు కార్లు, బైక్‌లపై ఈ భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ జావా అండ్ ఎజ్ది బైక్‌లపై ఆఫర్‌లను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఈ రెండు బైక్‌లు చాలా ఏళ్లుగా చాలా మందికి ఇష్టమైన బైక్‌లు కావడం గమనార్హం. మీరు మీ పాత బైక్‌ను ఎక్స్‌ఛేంజ్ మోడ్ ద్వారా కొత్త జావా బైక్‌ను కొనుగోలు చేసినప్పుడు పాత బైక్ ధర కంటే మీకు రూ.10,000 వరకు తగ్గింపు లభిస్తుంది. కానీ ఈ ఆఫర్ అన్ని జావా అండ్ ఎజ్ది బైకులపై అందుబాటులో లేదు. ఈ ఆఫర్ కేవలం జావా 42 అండ్ ఎజ్ది రోడ్స్టర్ అనే రెండు బైక్‌లపై మాత్రమే వర్తిస్తుంది. మీరు ఈ రెండు బైక్‌లను సింగిల్ టోన్ కలర్ వేరియంట్‌ లలో కొనుగోలు చేసినట్లయితే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

కస్టమర్‌లు పాత వాహనాన్ని మార్చుకుంటే 10,000 రూపాయల వరకు తగ్గింపు ఇంకా 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీని పొందుతారు.అయితే సాధారణంగా, బైక్‌లు 2 సంవత్సరాలు లేదా 24,000 కిలోమీటర్ల వరకు ఉచిత రిపేర్స్ ద్వారా కవర్ చేయబడతాయి. కానీ ఈ ఎక్స్ఛేంజ్ మోడ్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు, మీరు అదనంగా పది వేల రూపాయలు ఇంకా 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీని పొందువచ్చు. జావా 42 బైకు విషయానికొస్తే, ప్రస్తుతం దాదాపు రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విక్రయించబడుతోంది. అదేవిధంగా ఎజ్ది రోడ్స్టర్ దాదాపు 2.3 లక్షల రూపాయల ధరతో విక్రయించబడుతోంది.

  Last Updated: 15 Dec 2023, 02:10 PM IST