ప్రస్తుతం భారత్ లో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండడంతో వాహన వినియోధాలు ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపే ముగ్గు చూపుతున్నారు. దీంతో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆయా వాహనం తయారీ సంస్థలు అందుకు అనుగుణంగా కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చారు. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BattRE మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను లాంచ్ చేశారు.
ఎపిక్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌ను తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందించనున్నారు. ఇకపోతే ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 65 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. ఇక ధర విషయానికొస్తే.. ఈ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 ఎక్స్ షోరూమ్ ధరగా నిర్ణయించారు. బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 60వీ 40ఏహెచ్ బ్యాటరీని అందించారు. బ్యాటరీ ప్యాక్ ఐపీ67 రేటెడ్‌ను ఇచ్చారు. దీంతో బ్యాటరీ నీరు, దుమ్ము నుంచి రక్షణ పొందొచ్చు. ఇక స్కూటీ బ్యాటరీపై కంపెనీ మూడేళ్లు వారంటీ లేదా 30 వేల కి.మీల వారంటీని అందిస్తున్నారు. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీని కూడా అందించారు.
రీమూవబుల్ బ్యాటరీ కావడంతో స్కూటర్ ఛార్జింగ్ సులభంగా చేసుకోవచ్చు. అలాగే ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చెప్పుకోదగ్గ మరో అంశం. దీంట్లో బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ ఎంత మైలేజ్ ఇవ్వనుంది. బ్యాటరీ ఉష్ణోగ్రత, ఛార్జింగ్ సమయం వంటి సమాచారాన్ని చూపిస్తుంది. ఈ స్కూటీ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ కావడానికి 5 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ స్కూటర్‌ను ఎక్రూ ఎల్లో, స్టార్మీ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, క్యాండీ రెడ్, స్టార్‌లైట్ బ్లూ, ఐస్ బ్లూ, పెరల్ వైట్, కాస్మిక్ బ్లూ, గన్‌మెటల్, బ్లేజింగ్ బ్రాంజ్, హంటర్ గ్రీన్ బ్లాక్, గోల్డ్ రష్ వంటి కలర్స్ లో లభించనుంది..