Site icon HashtagU Telugu

Bajaj Electric Scooter: బజాజ్ చేతక్ స్పెషల్ ఎడిషన్ విడుదల.. ప్రత్యేకతలు ఇవే?

Bajaj Electric Scooter

Bajaj Electric Scooter

ప్రస్తుతం మార్కెట్ లో పెట్రోల్ ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రిక్ వేరియంట్లు తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ద్విచక్ర వాహన వినియోగదారులని విపరీతంగా ఆకర్శిస్తూ ఒకదానిని మించి ఒకటి ఈవీ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. పెద్ద ఎత్తున కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. పూర్తి పర్యావరణ హితం కావడం, మెయింటెనెన్స్ పెద్దగా లేకపోవడంతో అందరూ వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇందులో ఓలా, ఏథర్, టీవీఎస్, బజాబ్ వంటి కంపెనీలు అనేక రకాల మోడళ్లు, విభిన్న వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి. ఒక కంపెనీతో ఒకటి పోటీ పడి మరి ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి.

ఈ క్రమంలో బజాజ్ ఆటో మరో కొత్త స్కూటర్ ను లిమిటెడ్ ఎడిషన్ గా భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ పేరుతో రూ. 1.30 లక్షలతో ప్రారంభ ధరతో విడుదల చేసింది. మరి తాజాగా విడుదల చేసిన ఈ బజాజ్ చేతక్ స్పెషల్ ఎడిషన్ ధర, ఫీచర్స్ విషయానికి వస్తే.. బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ ఆగస్టు ఐదో తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ బైక్ రూ. 1.23 లక్షల ప్రారంభ ధర ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న బజాజ్ చేతక్ టాప్ స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇది బ్రూక్లిన్ బ్లాక్‌ లో సైడ్ ప్యానె ల్‌లపై చేతక్ డీకాల్స్‌ తో పూర్తి చేసి ఉంది. 2 టోన్ క్విల్టెడ్ సీటును కూడా కలిగి ఉంది.

ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే.. టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్‌ లతో కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ ను కలిగి ఉంటుంది. ఇ స్కూటర్‌లో స్పోర్ట్ రైడింగ్ మోడ్ కూడా ఉంది. అలాగే ఇది హిల్ హోల్డ్ కంట్రోల్‌ తో వస్తుంది. కాగా చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ స్కూటర్లో ప్రామాణిక మోడల్ వలె అదే 3.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక సారి ఛార్జ్ చేస్తే 127 కిమీల రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 73 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.