ప్రస్తుతం భారతదేశంలో ఈవీ వాహనాలు ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండడంతో వాహన వినియోధాలు ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపే ముగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు పోటీగా సీఎన్‌జీ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. అయితే ఇప్పటివరకు కేవలం సీఎన్‌జీ కార్లు మాత్రమే మార్కెట్లోకి విడుదల కాగా ప్రముఖ బైక్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో ఇటీవల భారతీయ ఎంట్రీ లెవల్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో సీఎన్‌జీ మోటార్ సైకిల్ ఫ్రీడమ్ 125 లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు టాప్ కంపెనీ బైక్స్ కి కూడా గట్టి పోటీని ఇస్తోంది. ముఖ్యంగా హీరో ఎక్స్ట్రీమ్ 125 ఆర్ కు పోటీగా నిలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ రెండు స్కూటర్లు ధర స్పెసిఫికేషన్ల విషయంలో ఒకదానిని మించి ఒకటి పోటీ పడుతున్నాయి. అయితే ఫ్రీడమ్ 125 బైక్‌పై మాత్రం పెట్రోల్, సీఎన్‌జీ రెండింటితో దూసుకుపోవచ్చు. ఇకపోతే బజాజ్ ఫ్రీడమ్ 125, హీరో ఎక్స్ట్రీమ్ 125 ఆర్ బైక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మోటార్ సైకిల్ విభాగంలో సీఎన్‌జీ, పెట్రోల్ వెర్షన్‌లో నడిచే మొట్టమొదటి మోటర్ సైకిల్‌గా బజాజ్ ఫ్రీడమ్ 125 నిలిచింది. అయితే హీరో ఎక్స్‌ట్రీమ్ కేవలం పెట్రోల్ ఆధారంగా పని చేస్తుందన్న విషయం తెలిసిందే. అలాగే ఈ బైక్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ గేర్బాక్స్ ఆధారంగా కూడా పని చేస్తుంది. 9.5 హెచ్‌పీ, 9.7 ఎన్ఎం గరిష్ట టార్క్ ఆధారంగా నడుస్తుంది. ఇక ఇంధన సామర్థ్యం పరంగా ఈ మోటార్ సైకిల్ లీటరు పెట్రోల్ 66 కి.మీ ల మైలేజ్ ఇస్తుందట.
అయితే ఫ్రీడమ్ 125 330 కి.మీ ల పరిధితో వస్తుందట. ప్రతి కేజీ సీఎన్జికీ 102 కి.మీ, పెట్రోల్ పై 65 కి.మీ మైలేజ్ ఇస్తుందనీ కంపెనీ వెల్లడించింది. కాగా ఇంధన సామర్థ్యం పరంగా చూసుకుంటే బజాజ్ మోటార్ సైకిల్ అధిక మైలేజ్ కోరుకునే వారికి సరైనది అని చెప్పవచ్చు. బజాజ్ ఫ్రీడమ్ 125 ముందు, వెనుక చక్రాలకు డ్రమ్ బ్రేక్ సెటప్‌తో వస్తుంది. అలాగే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ యూనిట్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సీడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మిస్డ్ కాల్ అలర్ట్లు, కాలర్ ఐడీ, బ్యాటరీ స్టేటస్, యూఎస్‌బీ పోర్ట్‌తో వస్తుంది. హీరో ఎక్స్ట్రీమ్ 125 ఆర్ ముందు భాగంలో 37 ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ షోవా మోనోషాకు కలిగి ఉంది.
ఎల్ఈడీ స్క్రీన్, ఎస్ఎంఎస్, కాల్ అలర్ట్లతో బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. కాగా బజాజ్ ఫ్రీడమ్ 125 మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఈ బైక్ కేవలం రూ. 95,000 నుంచి అందుబాటులో ఉంటుంది. మిడ్-రేంజ్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1.10 లక్షలుగా ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐబీఎస్ వేరియంట్ ధర రూ. 95,000, ఏబీఎస్ ధర రూ. 99,500 గా ఉంది. అయితే ఈ రెండు బైక్స్ లో మీరు పవర్, ఫీచర్లు, స్పోర్టియర్ లుక్ ను కోరుకుంటే హీరో ఎక్స్‌ట్రీమ్ 125 మీ ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇంధన సామర్థ్యం మంచి మైలేజ్ కోరుకుంటే బజాజ్ ఫ్రీడమ్ 125ను ఎంచుకోవచ్చు.