Site icon HashtagU Telugu

Bajaj CNG Bike: బజాజ్ CNG బైక్ మరింత ఆలస్యం.. జూలై 17న విడుదల..!

Bajaj CNG Bike

Bajaj CNG Bike

Bajaj CNG Bike: దేశంలోని మూడవ అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో తన కొత్త CNG బైక్ (Bajaj CNG Bike)ను మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ బైక్‌కు సంబంధించి అనేక కొత్త అప్‌డేట్‌లు నిరంతరం అందుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ బైక్‌ను విడుదల చేయడానికి మరింత సమయం పడుతుందని బజాజ్ ఆటో తెలిపింది. ముందుగా ఈ బైక్‌ను జూన్ 18న విడుదల చేయాల్సి ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. బజాజ్ మొదటి CNG బైక్ జూలై 17న విడుదల కానుంది. ఈ బైక్ పరీక్ష సమయంలో గుర్తించారు. ఈ బైక్ ద్విచక్ర వాహనదారులతో పాటు పర్యావరణానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంధన వినియోగం తగ్గుతుంది

బజాజ్ ఆటో ప్రకారం.. CNG బైక్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇంధన వినియోగం దాదాపు 50 నుండి 65% వరకు తగ్గుతుంది. మరోవైపు CNG బైక్‌లో కార్బన్ డయాక్సైడ్‌లో 50% తగ్గింపు, కార్బన్ మోనాక్సైడ్‌లో 75% తగ్గింపు, నాన్-మీథేన్ హైడ్రోకార్బన్ ఉద్గారాలలో సుమారు 90% తగ్గింపు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు CNG బైక్ రాకతో ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది.

CNG బైక్ లేదా పెట్రోల్ బైక్?

ఒకవైపు CNG బైక్ పొదుపుగా ఉంటుందని చాలా సార్లు ప్రూవ్ అయింది. మరోవైపు దీనిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు CNG బైక్ నిర్వహణ ఖర్చు పెట్రోల్ కంటే ఎక్కువ. వీటిని తరచుగా సర్వీసింగ్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా CNG ఫిల్టర్, సిలిండర్, గ్యాస్ లైన్ క్లీనింగ్ మొదలైన వాటిపై ఖర్చులు పెరుగుతాయి. CNG ఇంజిన్‌పై ఒత్తిడి తెస్తుంది. దీని కారణంగా దాని భాగాలు త్వరగా దెబ్బతింటాయి.

Also Read: Stopping Urination: మూత్రవిసర్జనను ఆపడం ఆరోగ్యానికి ప్రమాదకరం.. ఈ వ్యాధులు వచ్చే అవకాశం..!

CNG బైక్ 125cc ఇంజన్‌ తో వస్తుంది

మూలాలప్రకారం.. బజాజ్ కొత్త CNG బైక్‌ను 125cc ఇంజిన్‌తో విడుదల చేయవచ్చు. భద్రత కోసం బైక్‌లో డిస్క్ బ్రేక్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇందులో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ సౌకర్యం కూడా ఉంటుంది. సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి. అలాగే బైక్‌కు ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ దీని ధరను వెల్లడించలేదు. ఈ బైక్ ధర రూ.లక్ష నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.

We’re now on WhatsApp : Click to Join

CNG బైక్ పేరు ప్రకటించాల్సి ఉంది

ఇటీవలే కంపెనీ బ్రూజర్‌తో సహా మరికొన్ని పేర్ల ట్రేడ్‌మార్క్‌లను నమోదు చేసింది. కంపెనీ ఈ పేర్లలో ఒకదానిని తన కొత్త CNG బైక్‌కి ఇవ్వవచ్చని అంచనా. త్వరలో కంపెనీ అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. CNG బైక్‌లో LED లైట్లు ఉంటాయి. ఈ బైక్ సాధారణ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ సీటుతో వస్తుంది. అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్‌లను బైక్‌లో అందించవచ్చు.