Site icon HashtagU Telugu

Bajaj CNG Bike: బజాజ్ నుంచి మొద‌టి CNG బైక్.. జూలై 5న నితిన్ గడ్కరీ చేతుల‌మీదుగా లాంచ్‌..!

CNG Bike Mileage

CNG Bike Mileage

Bajaj CNG Bike: దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో భారతదేశపు మొట్టమొదటి CNG బైక్ (Bajaj CNG Bike) టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ పేరు బ్రూజర్ అని అంటున్నారు. ఇది రెండు వేరియంట్లలో రానుంది. ఎక్కువ మైలేజీని కోరుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. అయితే సీఎస్‌జీ బైక్ లాంచ్ ఇప్ప‌టికే చాలా సార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

జూలై 5న ప్రారంభించనున్నారు

బజాజ్ ఆటో కొత్త CNG బైక్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జూలై 5న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ ప్రదర్శించింది. టీజర్‌లో బైక్‌కు సంబంధించిన చిన్న వీడియో చూడవచ్చు. కానీ ఫొటోలు చాలా స్పష్టంగా లేవు. ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. CNG బైక్ స్విచ్ కుడి వైపు హ్యాండిల్ బార్‌లో కనిపిస్తుంది. ఈ స్విచ్ సహాయంతో బైక్‌ను ఇంధనం, CNG మోడ్‌కు సులభంగా మార్చవచ్చు. ఈ ఫీచర్ నిజంగా గొప్పదని అంటున్నారు.

Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. బీసీసీఐ ముందు కీల‌క డిమాండ్‌!

క్లాసిక్ లుక్

టీజర్ ప్రకారం.. ఈ బజాజ్ CNG డిజైన్ సరళంగా ఉంటుంది. ఇది రౌండ్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంటుంది. బైక్ కొద్దిగా ప్రీమియం టచ్ పొందుతుంది. విశేషమేమిటంటే.. ఇది మరింత గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. తద్వారా మంచిగా లేని రోడ్లపై సుల‌భంగా ప్ర‌యాణిస్తుంది. బైక్‌ను 125సీసీ ఇంజన్‌లో ప్రవేశపెట్టవచ్చని అంచనా. తద్వారా బైక్‌ను నడుపుతున్నప్పుడు పవర్, మైలేజీ బాగానే ఉంటుంది. మీడియా కథనాల ప్రకారం.. ఈ బైక్‌ను రూ.90,000 ప్రారంభ ధరతో విడుదల చేయవచ్చని స‌మాచారం. నివేదికల ప్రకారం.. ఈ బైక్‌లో 3 నుండి 5 లీటర్ల సిఎన్‌జి సిలిండర్ ఉంటుంద‌ని స‌మాచారం. ఇది దాని సీటు కింద ఉంటుంది.

We’re now on WhatsApp : Click to Join