Bajaj CNG Bike: ఇండియాలోకి మొదటి బజాజ్ సీఎన్‌జీ బైక్.. ధర ఫీచర్స్ ఇవే?

ద్విచక్ర వాహన వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎందుకంటే దేశంలో తొలి సీఎన్జీ మోటార్ సైకిల్ ను జులై 5న బజాజ్ కంపెనీ సీఎన్జీ బైక్‌ను లాంచ్ చేయనుంది. అయితే ఇండియాలో విడుదల అవుతున్న మొట్ట మొదటి సిఎన్జి మోటార్ సైకిల్ కావడం

  • Written By:
  • Publish Date - July 4, 2024 / 08:43 PM IST

ద్విచక్ర వాహన వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎందుకంటే దేశంలో తొలి సీఎన్జీ మోటార్ సైకిల్ ను జులై 5న బజాజ్ కంపెనీ సీఎన్జీ బైక్‌ను లాంచ్ చేయనుంది. అయితే ఇండియాలో విడుదల అవుతున్న మొట్ట మొదటి సిఎన్జి మోటార్ సైకిల్ కావడంతో వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి మరి కొన్ని గంటల్లో లాంచ్ కాబోతున్న ఈ మోటార్ సైకిల్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెట్రోల్ నుంచి సీఎన్జీకి మార్చే బటన్ కూడా ఈ బైక్‌కు అమర్చినట్టు ఇటీవల తెలిపారు.

అయితే ఈ బటన్ నొక్కితే చాలు మీరు సీఎన్జీ నుంచి పెట్రోల్ మోడ్‌ లోకి వెళతారు. కాగా ఇప్పుడు విడుదల కాబోతున్న ఈ మోటార్ సైకిల్ దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే మోటార్ సైకిల్ కానుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, సీఎన్జీ ధరల్లో రూ.20 వరకు వ్యత్యాసం ఉందన్న విషయం తెలిసిందే. కాకా ఈ బజాజ్ సీఎన్జీ బైక్ 125 సీసీ ఇంజన్ తో వస్తుందట. ఈ బైక్ పనితీరు 100 సీసీ కమ్యూటర్ బైక్‌తో సమానంగా వచ్చే అవకాశం ఉంది. ఇది 100 సీసీ కమ్యూటర్ బైక్‌కు సమానం లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని పొందడానికి ఇంజిన్‌ ను మార్చే అవకాశం ఉంది. లీటరుకు 70 నుండి 90 లేదా 100 కిలో మీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఈ మోటార్ సైకిల్ కి దాదాపు 5 లీటర్ల చిన్న పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది.. అలాగే ఇది సుమారు 4-5 కిలోల పెద్ద సీఎన్జీ ట్యాంక్ ఉంటుంది.

ఈ బైక్ స్ట్రాంగ్ ట్యాంక్, సిల్వర్ కలర్ యాక్సెసరీస్, హ్యాండిల్ బార్ బ్రేసెస్, నకిల్ గార్డ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రౌండ్ హెడ్ లైట్స్ లను కలిగి ఉంటుంది. ఈ బైక్ లో అడ్వెంచర్ బైక్ లాంటి హైట్ సీటు, అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్, అడ్వెంచర్ స్టైల్ కూడా ఉండ నున్నాయి. పెద్ద సైడ్ పాన్, స్టైలిష్ బెల్లీ పాన్, 5 స్పోక్ అల్లాయ్ వీల్స్, బైకుల కోసం స్ట్రాంగ్ గ్రాబ్ రైల్స్, రిబ్బెడ్ సీట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనో షాక్ సెటప్‌ తో పాటుగా అనేక కలర్ ఆప్షన్లు ఉంటాయట. అలాగే ఈ బైక్ రెండు ఇంధన ట్యాంక్‌లతో వస్తుందట. ఒక ప్రైమరీ CNG ట్యాంక్, సీటు కింద ఉంచబడుతుంది, పెట్రోల్ ట్యాంక్ సాధారణంగానే ఉంటుంది. బైక్ CNG అయిపోతే పెట్రోల్ ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు బటన్ నొక్కితే సరిపోతుంది. అయితే ఈ సీఎన్జీ బైకులను భారతదేశ మొత్తం అంతా ఒకేసారి విడుదల చేయకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు.

2023 నాటికి భారతదేశంలో సిఎన్జి స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 6,159 లో ఉన్న సిఎన్జి స్టేషన్లను17,500 కు పెంచాలని ఆలోచిస్తుందట. ఇకపోతే ఈ బైక్ ధర విషయానికి వస్తే.. రూ.80,000 ఉంటుందని అంచనా. ఇది హోండా షైన్ 125కి పోటీగా రూ. 79,800 ధరతో ఉంటుంది. టీవీఎస్ రైడర్ 125, హీరో Xtreme 125R వంటి ప్రీమియం 125సీసీ బైక్‌లు కూడా ఇదే ధరలో అందుబాటులో ఉన్నందున, CNG బైక్ ధర దాదాపు రూ.90,000 లేదా రూ. 1 లక్ష అయి ఉండవచ్చని అంచన.