Bajaj CNG Bike: జూన్ 18న తొలి సీఎన్‌జీ బైక్‌ను విడుద‌ల చేయ‌నున్న బ‌జాజ్‌..!

ప్రతి నెలా 20 వేల సిఎన్‌జి బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో జూన్ 18న తన తొలి సిఎన్‌జి బైక్‌ ను విడుదల చేయనుంది.

  • Written By:
  • Updated On - May 6, 2024 / 04:06 PM IST

Bajaj CNG Bike: ప్రతి నెలా 20 వేల సిఎన్‌జి బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో జూన్ 18న తన తొలి సిఎన్‌జి బైక్‌ (Bajaj CNG Bike)ను విడుదల చేయనుంది. నివేదికల ప్రకారం.. బజాజ్ ఆటో 5-6 CNG బైక్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో 3 మోడళ్లను ఈ సంవత్సరం చివరి నాటికి మిగిలిన మోడళ్లను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయవచ్చు. CNG బైక్‌లు పూర్తిగా కొత్త పేరుతో రానున్నాయి. అంటే ప్రస్తుత మోడల్‌లో CNG కిట్ ఇన్‌స్టాల్ చేయబడదు. బజాజ్ కొత్త CNG బైక్‌లు టెస్టింగ్ సమయంలో చాలా సార్లు గుర్తించబడ్డాయి. అయితే డిజైన్ గురించి పెద్దగా వివ‌రాలు వెల్లడించలేదు.

CNG బైక్‌లు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో రావు

కంపెనీ ప్రకారం.. మీరు రూ. 70 వేలకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పొందుతున్నారు. అయితే CNG బైక్ చౌకగా ఉండదు. అంటే ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో సీఎన్‌జీ బైక్‌లు రావు. CNG బైక్‌లో డిస్క్ బ్రేక్‌లు, పొడవైన సీటు, అల్లాయ్ వీల్స్ కనిపించవచ్చు. పూర్తి డిజిటల్ క్లస్టర్, సింగిల్-ఛానల్ ABS కూడా ఉండే అవకాశం ఉంది. లాంచ్‌కు ముందు నుంచే మార్కెట్‌లో సీఎన్‌జీ బైక్‌లకు సంబంధించిన సంద‌డి వాతావ‌ర‌ణం నెలకొంది. కంపెనీ ప్రకారం,, భారతదేశంలో CNG బైక్‌ల మార్కెట్ విలువ చాలా పెద్దదిగా ఉండబోతోంది.

Also Read: Most Sixes In IPL 2024: ఐపీఎల్ 2024లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడు ఎవ‌రంటే..?

అత్యంత శక్తివంతమైన పల్సర్ NS400Z విడుదలైంది

బజాజ్ ఆటో ఇటీవలే అత్యంత శక్తివంతమైన పల్సర్ NS400Zని విడుదల చేసింది. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 1.85 లక్షలు. ఈ బైక్‌లో 373.27సీసీ ఇంజన్ కలదు. ఇది 40 PS పవర్, 35 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. విశేషమేమిటంటే.. ఈ ఇంజన్ భద్రత కోసం 6 స్పీడ్ గేర్‌బాక్స్ సదుపాయాన్ని కలిగి ఉంది. బైక్‌కు ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ అందించబడింది. ఈ బైక్‌లో 17 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి.

We’re now on WhatsApp : Click to Join