Site icon HashtagU Telugu

Bajaj Auto : అకుర్ధిలో బజాజ్ కొత్త ప్లాంట్…అక్కడి నుంచే చేతక్ ఈవీ తయారీ..!!

Bajaj Chetak 1654914171085 1654914186004

Bajaj Chetak 1654914171085 1654914186004

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కోసం పూణేలోని అకుర్థిలో కొత్తగా ప్లాంట్ ను నిర్మించింది. దీన్ని సంస్థ చైర్మన్ రాజీవ్ బజాజ్ ప్రారంభించారు. దీంతో చేతక్ ఈవీ విక్రయాలు భారీగా ఊపందుకోనున్నాయి. ఇప్పటిదాకా కంపెనీకి పరిమిత సామార్థ్యమే ఉండేది. సంస్థ వ్యవస్థాపకుడైన రాహుల్ బజాజ్ జయంతి సందర్భంగా ఫ్లాంట్ ను ప్రారంభించారు.

కాగా 1970లో తన తొలి చేతక్ స్కూటర్ ను అకుర్థిలోని ప్లాంట్ నుంచే తయారైంది. నాడు బజాజ్ చేతక్ అంటే ఓ పెద్ద ట్రెండ్ క్రియేట్ చేసింది. మూడు దశాబ్దాల పాటు మార్కెట్ ను ఏలింది చేతక్. మారిన పరిస్థితుల్లో ఆ తర్వాత కాలంలో చేతక్ ను బజాజ్ ఆటో పూర్తిగా నిలిపివేసి మోటార్ సైకిళ్ల తయారీపై ద్రుష్టిపెట్టింది. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తన పాపులర్ బ్రాండ్ చేతక్ ను ఎలక్ట్రిక్ స్కూటర్ గా 2019లో ప్రవేశపెట్టింది

ఇప్పటివరకు 14వేల చేతక్ ఈవీలను విక్రయించింది. మరో 16వేల చేతక్ లకు బుకింగ్ లు వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. డిమాండ్ కు తగ్గ సరఫరా కోసం ఈవీల తయారీకి ప్రత్యేకంగా ప్లాంట్ ను ఏర్పాటు చేసింది బజాజ్. పెరిగే డిమాండ్ కు అనుగుణంగా ప్లాంట్ సామర్థ్యాన్ని వార్షికంగా 5లక్షల చేతక్ ఈవీల తయారీకి విస్తరించే అవకాశం ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.