New Car Tips: కొత్తకారు విషయంలో అలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఇంజన్ పాడవ్వడం ఖాయం?

మామూలుగా ఏదైనా వాహనం కొత్తగా కొనుగోలు చేసినప్పుడు చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్లు బైకుల విషయంలో చాలామంది చాలా జాగ్రత్తలు పాటిస్

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 04:00 PM IST

మామూలుగా ఏదైనా వాహనం కొత్తగా కొనుగోలు చేసినప్పుడు చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్లు బైకుల విషయంలో చాలామంది చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కొత్త పాత అని తేడా లేకుండా ఎలా పడితే అలా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొత్త కారు నడిపేటప్పుడు ప్రారంభంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, కారు పాడవకుండా, భారీ నష్టం రాకుండా ఉంటుంది. మరి కొత్త కారు పాడవకుండా ఎక్కువ రోజులు లైఫ్ రావాలంటే ఏం చేయాలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కొత్త కారు ఇంజిన్ సరిగ్గా ట్యూన్ చేయడానికి కొంత సమయం పడుతుంది.

అందువల్ల, మొదటి సర్వీస్ తర్వాత వెంటనే దూర ప్రయాణాలకు వెళ్లకూడదు. అలా వెళ్తే, ఇంజిన్‌పై అధిక ఒత్తిడి పడి, దాని లైఫ్, పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి కారు కొన్న తర్వాత కొద్ది కాలం పాటు ఆగి ఆ తర్వాత వెళ్లడం మంచిది. కొత్త కారులో ఎక్కువ లగేజీ లేదా వ్యక్తులను తీసుకెళ్లడం వల్ల కూడా ఇంజిన్‌పై లోడ్ పెరుగుతుంది. దీని వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. ఇంజిన్ వేడెక్కే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, కారు సామర్థ్యం ప్రకారం సరుకులు, వ్యక్తులను తీసుకెళ్లాలి. కొన్ని కొత్త కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది. ఇది దూర ప్రయాణాల సమయంలో కారు వేగాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ, దాని ఉపయోగం ప్రారంభంలో తగ్గించాలి.

ఎందుకంటే అది ఇంజిన్ చాలా కాలం పాటు అదే వేగంతో పనిచేసేలా బలవంతం చేస్తుంది. ఇలా చెయ్యడం ఇంజిన్‍కి మంచిది కాదు. అలాగే చాలామంది ఎదురుళ్లకు హెల్ప్ చేయడం కోసం రోడ్డుపై కార్లను ఆగిపోయినప్పుడు కొత్త కారుతో మరొక కారునులాగుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది కారు ఇంజిన్, పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇతర వాహనం మీ కారు కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటే, దాన్ని మీ కారుతో లాగితే, మీ కారు ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. లాగుతున్న సమయంలో, కారు ఇంజిన్‌పై ఎక్కువ లోడ్ ఉంటుంది. ఇది దాని జీవితాన్ని తగ్గిస్తుంది. అందువల్ల టోయింగ్ అవసరం అయితే, సాధ్యమైనంత తక్కువ దూరం లాగాలి. అలాగే కొత్త కారుతో వరద నీటిలో కారు నడపడం చాలా ప్రమాదకరం. వరద నీరు కారు ఇంజిన్, ఎయిర్ ఇన్‌లెట్, బ్యాటరీ, వైరింగ్, ఎలక్ట్రికల్ ఫీచర్లు మొదలైనవాటిని దెబ్బతీస్తుంది. ఇది కొత్త కారుకు నష్టం కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, వరద నీటిలో కారు నడపకుండా చూసుకోవాలి. అలాగే రోడ్డుపై నీరు ఉంటే, కచ్చితంగా కారు వేగాన్ని బాగా తగ్గించాలి. నీటిలో కారు టైర్లు స్కిడ్ అయ్యి, ఘోర ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కొత్త కారు విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.