Site icon HashtagU Telugu

Top automatic cars under 10 lakh: రూ.10 లక్షల బడ్జెట్​ లోపు టాప్​ ఆటోమెటిక్​ కార్లు ఇవే.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Mixcollage 30 Jan 2024 03 04 Pm 3294

Mixcollage 30 Jan 2024 03 04 Pm 3294

ఇటీవల కాలంలో ఆటోమెటిక్​ వెహికిల్స్​ కి మార్కెట్ లో మంచి డిమాండ్​ కనిపిస్తోంది. నగరాల్లో ట్రాఫిక్​ కష్టాలను భరించలేక చాలా మంది ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ వైపు అడుగులు వేస్తున్నారు. మరి మీరు కూడా ఒక ఆటోమెటిక్​ కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. దేశంలో రూ. 10లక్షల బడ్జెట్​ లోపు అందుబాటులో ఉన్న ది బెస్ట్​ ఆటోమెటిక్​ వెహికిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మారుతీ సుజుకీ ఇగ్నిస్​.. ఈ మారుతి సుజుకి కార్ క్రాసోవర్​- హ్యాచ్​బ్యాక్​కి మిక్స్​గా ఉంటుంది. ఎస్​యూవీ కాకపోయినా డిజైన్​ని చూస్తే మాత్రం ఇదొక మైక్రో ఎస్​యూవీ అనిపిస్తుంది. ప్రీమియం నెక్సా షోరూమ్స్​లో వీటిని విక్రయిస్తోంది మారుతీ సుజుకీ. ఇందులో 1.2 లీటర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 88 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ ఏఎంటీ గేర్​బాక్స్​ దీని సొంతం. దీని ఎక్స్​షోరూం ధర రూ. 6.93 లక్షలు రూ. 8.16లక్షల మధ్యలో ఉంటుంది.

అలాగే ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఈ టాటా పంచ్​ ఒకటి. ఈ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ ఏఎంటీ వర్షెన్​లో 12 ట్రిమ్స్​ ఉండటం విశేషం. వీటిల్లోని 11 ఆప్షన్స్​ ధర రూ. 10లక్షల కన్నా తక్కువగా ఉన్నాయి. టాప్​ ఎండ్​ మోడల్​ని పక్కన పెడితే.. ఈ టాటా పంచ్​ ఏఎంటీ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 7.50లక్షలు రూ. 9.35లక్షల మధ్యలో ఉంటుంది. ఇందులోని 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​కి 5 స్పీడ్​ ఏఎంటీ కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇది 87 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. హ్యుందాయ్​ నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్​టర్​ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఏఎంటీ వర్షెన్​లో ఆరు వేరువేరు ట్రిమ్స్​ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 1.2 లీటర్​ కప్పా పెట్రోల్​ ఇంజిన్​.. 82 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఆరు వేరువేరు ట్రిమ్స్​లని ఐదంటి ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షల లోపే ఉంటాయి.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. 2023లో లాంచ్​ అయిన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ బలెనోకి క్రాసోవర్​ లా కనిపిస్తుంది. ఇందులో 1.0 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​కి ఏఎంటీ కనెక్ట్​ చేసి ఉంటుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆటో మెటిక్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.88 లక్షలు రూ. 9.28లక్షల మధ్యలో ఉంటుంది.