Tata Punch price hike: మరోసారి టాటా పంచ్ ధరను పెంచేసిన టాటా మోటార్స్.. ఎంతో తెలుసా?

2024 తర్వాత ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి వినియోగదారులకు వరసగా షాక్ లు ఇస్తున్నాయి. అందులో బాగంగానే తాజాగా కస్టమర్లకు మరోమా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 05 Feb 2024 02 45 Pm 2843

Mixcollage 05 Feb 2024 02 45 Pm 2843

2024 తర్వాత ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి వినియోగదారులకు వరసగా షాక్ లు ఇస్తున్నాయి. అందులో బాగంగానే తాజాగా కస్టమర్లకు మరోమారు షాక్​ ఇచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే గత ఏడాది చెప్పిన విధంగానే ఇప్పటికే ఒకసారి ధరను పెంచేసిన టాటా మోటార్స్ తాజాగా ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న టాటా పంచ్​ ధరను పెంచింది.​ వేరియంట్లను బట్టి టాటా పంచ్​పై గరిష్ఠంగా రూ. 17 వేల వరకు హైక్​ తీసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. టాటా పంచ్​లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి ప్యూర్​, అడ్వెంచర్​, అకంప్లీష్​డ్​, క్రియేటివ్​.

ఎంట్రీ లేవల్​ టాటా పంచ్​ ప్యూర్​ వేరియంట్​ ధర రూ. 13వేలు పెరిగింది. ఫలితంగా టాటా మోటార్స్​కి చెందిన టాటా పంచ్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.13లక్షలకు చేరింది. ఇతర వేరియంట్ల ధరలు గరిష్ఠంగా రూ. 10వేల వరకు పెరిగాయి. అలాగే టాటా పంచ్​లో సీఎన్​జీ మోడల్​ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా.. దాని ధర కూడా పెరిగింది. సీఎన్​జీ మోడల్​పై రూ. 17వేల వరకు ప్రైజ్​ హైక్​ తీసుకుంది టాటా మోటార్స్​. అయితే ధరల పెంపుతో టాటా పంచ్​ ఎక్స్​షోరూం ప్రైజ్​ వివరాలు తెలుసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్​సైట్​ని లేదా స్థానిక డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ టాటా పంచ్​లో మస్క్యులర్​ క్యాంప్​షెల్​ బానెట్​ ఉంటుంది. ఇందులో 1.2 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంది.

ఇది.. 84 హెచ్​పీ పవర్​ని, 113 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ మోడల్​ 72 హెచ్​పీ పవర్​ని, 103 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​, ఏఎంటీ గేర్​బాక్స్​ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్స్​ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే టాటా పంచ్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని కూడా తీసుకురాబోతోంది టాటా మోటార్స్​ సంస్థ. 2025లో ఈ వెహికిల్​ లాంచ్​ అవుతుందని సమాచారం. తన పోర్ట్​ఫోలియోలోని వెహికిల్స్​ని 3 ఏళ్లకు ఒకసారి అప్డేట్​ చేస్తూ ఉంటుంది టాటా మోటార్స్​. ఇందులో భాగంగానే టాటా నెక్సాన్​, నెక్సాన్​ ఈవీ, హారియర్​, సఫారీ ఎస్​యూవీలకు 2023లో ఫేస్​లిఫ్ట్​ వర్షెన్స్​ వచ్చాయి. ఇక 2021లో లాంచ్​ అయిన టాటా పంచ్​కు 2024లో అప్డేటెడ్​ వర్షెన్​ రావాల్సి ఉంది. అయితే ఈ మోడల్​ 2025 రెండో భాగంలో మార్కెట్​లోకి అడుగుపెడుతుందని టాక్​ నడుస్తోంది.

  Last Updated: 05 Feb 2024, 02:46 PM IST