Ola Electric scooter: మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేయబోతున్న ఓలా.. ధర ఫీచర్స్ ఇవే?

ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ నుంచి ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల అయిన విషయం తెలిసిందే. వాటితో పాటు కొత్త కొత్త

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 03:30 PM IST

ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ నుంచి ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల అయిన విషయం తెలిసిందే. వాటితో పాటు కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది ఓలా. అందులో భాగంగానే మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకురాబోతోంది. ఓలా ఎలక్ట్రిక్​ కొత్త కమర్షియల్​ స్కూటర్​లో మినిమలిస్ట్​ డిజైన్​ ఉండబోతోంది. స్టైల్​ కాకుండా ఫంక్షనాలిటీపై సంస్థ ఫోకస్​ చేస్తుండటం ఇందుకు కారణం. లాస్ట్​ మైల్​ డెలివరీ, బీ2బీ సెక్టార్స్​కు ఉపయోగపడే విధంగా ఈ వెహికిల్​ని రూపొందిస్తోంది దిగ్గజ 2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ.

ఈ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కాంపాక్ట్​ ఫ్రెంట్​ ఏప్రాన్​, సీట్​ కింది షీల్డెడ్​ ప్యానెల్స్​, సాడిల్​ వెనక లగేజ్​ ర్యాక్​లు ఉండవచ్చు. ఇందులో సింగిల్​ సీట్​ ఉంటుంది. కానీ పిలియన్​ సీడ్​ని యాడ్​ చేసుకునే ఆప్షన్​ని కూడా సంస్థ ఇస్తోంది. రెండు వీల్స్​కి డ్రమ్​ బ్రేక్స్​ వస్తాయి. ఎస్​1 ఎయిర్​, ఎస్​1 ఎక్స్​ సిరీస్​లో కనిపించే వీల్స్​ లానే ఈ కొత్త వెహికిల్​ వీల్స్​ కూడా ఉంటాయి. ఓలా ఎలక్ట్రిక్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​లో చిన్న డిజిటల్​ డ్యాష్​బోర్డ్​ ఉంటుంది. యులు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో కనిపించే స్వాపెబుల్​ బ్యాటరీలను ఈ స్కూటర్​లో సంస్థ వాడే అవకాశం ఉంది. మోటార్​, రేంజ్​, ఛార్జింగ్​ స్పీడ్​, వెహికిల్​ స్పీడ్​ వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు.

ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ నుంచి రాబోతున్న కొత్త ఈ-స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 89,999గా ఉండే అవకాశం ఉంది. ఇదే నిజమైతే బడ్జెట్​ ఫ్రెండ్లీ స్కూటర్స్​ లో ఈ మోడల్​ కి మంచి డిమాండ్​ కనిపించే అవకాశం ఉంది. కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలు ప్రస్తుతం రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. లాంచ్​ డేట్​పైనా ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.