Hyundai Casper EV: హ్యుందాయ్​ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​.. పూర్తి వివరాలివే?

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ మోటార్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని విడుదల చేసేందుకు ప్లాన్ లను సిద్ధం చేస్తోంది. ఆ

  • Written By:
  • Publish Date - February 11, 2024 / 08:30 PM IST

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ మోటార్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని విడుదల చేసేందుకు ప్లాన్ లను సిద్ధం చేస్తోంది. ఆ వెహికల్ పేరు హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ. కాగా ఈ వెహికల్ ని ఈ ఏడాది చివర్లో ఇది అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ కి సంబంధించి, ఒక వార్త బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా వీధుల్లో హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ టెస్ట్​ రన్​ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి.

ఇకపోతే ఈ వెహికల్ కీ సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ ఒక బుడ్డ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అని స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్​లో ఉన్న కాస్పర్​కి, త్వరలోనే లాంచ్​ అయ్యే ఈవీ వర్షెన్​ డిజైన్​కి మధ్య పెద్దగా తేడా కనిపించడం లేదు. కాస్పర్​ ఈవీలో సర్క్యులర్​ హెడ్​లైట్స్​, ఎల్​ఈడీ లైట్​ సిగ్నేచర్స్​పై పారామెట్రిక్​ పిక్సెల్​ పాటర్న్స్​, స్లీక్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ వంటివి ఉన్నాయి. ఈ హ్యుందాయ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో స్పోర్టీ అలాయ్​ వీల్స్​, సీ పిల్లర్​ మౌంటెడ్​ రేర్​ డోర్​ హ్యాండిల్స్​, బ్లాక్​డ్​ ఔట్​ ఫంక్షనల్​ రూఫ్​ రెయిల్స్​ వంటివి కనిపిస్తున్నాయి. కాగా పెట్రోల్​ వర్షెన్​తో పోల్చుకుంటే హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ వీల్​బేస్​ కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే కేబిన్​ స్పేస్​ మరింత పెరుగుతున్నట్టు అవుతుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో అడ్వాన్స్​డ్​ బ్యాటరీ ప్యాక్​ని హ్యుందాయ్​ వినియోగిస్తుందని టాక్​ నడుస్తోంది. ఈ బ్యాటరీ ప్యాక్​ రేంజ్​ 320 కి.మీలుగా ఉంటుందని సమాచారం. దీనిపై ప్రస్తుతం క్లారిటీ లేదు. హ్యుందాయ్​ కాస్పర్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో భారీ 10 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, హీటెడ్​ స్టీరింగ్​ వీల్​, హీటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, ఆర్టిఫీషియెల్​ లెథర్​ అప్​హోలిస్ట్రీ,​ వెంటిలేటెడ్​ డ్రైవర్​ సీట్​, సింగిల్​ పన్​ సన్​రూఫ్​, మూడ్​ ల్యాంప్​, బ్లూలింక్​ కనెక్టివిటీ వంటి ఫీచర్స్​ కూడా ఉంటాయని సమాచారం. హ్యుందాయ్​ కొత్త ఈవీలో ఆడాస్​ ఫీచర్స్​ కోసం ఫ్రెంట్​ రేడార్​ మాడ్యూల్​ ఉంటుందట. ఇకపోతే దీని ధర విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా మార్కెట్​లో హ్యుందాయ్​ కాస్పర్​ ఈవీ ధర 40వేల ఏయూడీగా ఉండొచ్చు. అంటే ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 21.55లక్షలు గా ఉండనుంది.

Follow us