Bajaj Auto CNG bikes: మార్కెట్ లోకి రాబోతున్న బజాజ్ ఆటో సీఎన్​జీ బైక్స్.. లాంచింగ్ డేట్ అప్పుడే?

దేశంలో అతిపెద్ద బైక్స్ తయారీ సంస్థ అయిన బజాజ్ ఆటో ఇప్పటికే పలు రకాల బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొ

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 03:30 PM IST

దేశంలో అతిపెద్ద బైక్స్ తయారీ సంస్థ అయిన బజాజ్ ఆటో ఇప్పటికే పలు రకాల బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్తగా మార్కెట్ లోకి సీఎన్​జీ మోటార్​సైకిల్స్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాటు చేసుకుంటోంది బజాజ్ ఆటో. అయితే ఈ సీఎన్​జీ బైక్స్ 2025 ఆర్థిక ఏడాదిలో మార్కెట్​లోకి అడుగుపెడతాయని సమాచారం. ఈ బైక్స్​ అటు పెట్రోల్​తో పాటు ఇటు సీఎన్​జీ పైనా నడుస్తాయట. ఈ నేపథ్యంలో ఈ బజాజ్​ ఆటో సీఎన్​జీ బైక్స్​ కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. 3 వీలర్​ సీఎన్​జీ వెహికల్స్​లో గ్రాండ్​గా సక్సెస్​ అయిన సంస్థ బజాజ్​ ఆటో.

ఇక ఇప్పుడు 2 వీలర్​ సీఎన్​జీ బైక్స్​పై ఫోకస్​ చేసింది. ఈ సరికొత్త సీఎన్​జీ బైక్స్​ కోసం ప్రత్యేకంగా ఒక బ్రాండ్​ని సృష్టిస్తున్నట్టు బజాజ్​ ఆటో ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ రాకేశ్​ శర్మ తెలిపారు. అయితే పెట్రోల్​ ఆధారిత బైక్స్​తో పోల్చుకుంటేఈ సీఎన్​జీ 2 వీలర్​ వెహికల్స్​ ధర కాస్త ఎక్కువే ఉండవచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. మేన్యుఫ్యాక్చరింగ్​ ప్రాసెస్​ ఎక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. సీఎన్​జీ బైక్స్​ కోసం ఫ్యూయెల్​ ట్యాంక్స్​ని ప్రత్యేకంగా రూపొందించాలి. ఈ ఫ్యూయెల్​ ట్యాంక్​లో పెట్రోల్​, సీఎన్​జీ రెండు ఆప్షన్స్​ ఉండాలి. ఈ టెక్నాలజీకి సంబంధించిన ఎలాంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.

అయితే మరి ఈ సీఎన్​జీ బైక్స్​ పూర్తిగా కొత్తగా ఉంటాయా? లేక ఇప్పుడున్న బైక్ మోడల్స్​కి సీఎన్​జీ టచ్​ ఇస్తుందా? అన్న క్లారిటీ లేదు. ప్రస్తుతం మార్కెట్​లో అనేక సీఎన్​జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దాదాపు అన్ని ఐసీఈ ఇంజిన్​ మోడల్స్​కి సీఎన్​జీ టచ్​ ఇచ్చినవే. అయితే.. ఒక్క బైక్​ లాంచ్​ చేసి, దానికి ఎంతటి ఆదరణ లభిస్తోంది? అని చూసి, మరో బైక్​ని రూపొందించడం కాకుండా వరుసగా సీఎన్​జీ బైక్స్​ని తయారు చేసి, వాటిని మార్కెట్​లో విడుదల చేయాలన్న స్ట్రాటజీతో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యూయెల్​ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ సీఎన్​జీ బైక్స్​ని రూపొందిస్తున్నట్టు శర్మ తెలిపారు. ఒక్క బైక్​ని మాత్రమే లాంచ్​ చేయడం లేదు. ఈ సెగ్మెంట్​లో వివిధ బైక్స్​ని లాంచ్​ చేస్తున్నాము. సీఎన్​జీ మోటార్​సైకిల్స్​ కోసం ప్రత్యేకంగా ఓ పోర్ట్​ఫోలియో ఉండాలన్నది మా ఆలోచన అని శర్మ వివరించారు.