Auto retail sales: గణనీయంగా పెరిగిన వాహన విక్రయాలు..!

పండుగ సీజన్‌ నేపథ్యంలో అక్టోబరులో వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

  • Written By:
  • Publish Date - November 7, 2022 / 10:06 PM IST

పండుగ సీజన్‌ నేపథ్యంలో అక్టోబరులో వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే రిటైల్‌ అమ్మకాల్లో 48 శాతం వృద్ధి నమోదైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. 2021 అక్టోబరులో 14,18,726 వాహనాల రిజిస్ట్రేషన్‌ జరగ్గా.. గత నెలలో అవి 20,94,378 యూనిట్లకు చేరాయి. ప్రయాణ, వాణిజ్య, ద్విచక్ర, ట్రాక్టర్లు, త్రిచక్ర.. ఇలా అన్ని విభాగాల్లో వృద్ధి నమోదు కావడం విశేషం.

అక్టోబర్ 2022లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 48% పెరిగి 20,94,378 యూనిట్లకు చేరుకున్నాయి. క్రితం సంవత్సరం ఇదే కాలంలో పరిశ్రమ 14,18,726 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) తెలిపింది. FADA అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ.. అక్టోబర్‌లో ఎక్కువ భాగం పండుగల సీజన్ కావడంతో అన్ని వర్గాల డీలర్‌షిప్ అవుట్‌లెట్‌లలో సెంటిమెంట్‌లు చాలా సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. పండుగ సీజన్‌ నేపథ్యంలో అక్టోబరులో వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే రిటైల్‌ అమ్మకాల్లో 48 శాతం వృద్ధి నమోదైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. 2021 అక్టోబరులో 14,18,726 వాహనాల రిజిస్ట్రేషన్‌ జరగ్గా.. గత నెలలో అవి 20,94,378 యూనిట్లకు చేరాయి.

42 రోజుల పండుగ కాలంలో పరిశ్రమ రిటైల్ విక్రయాలు 29% వృద్ధితో 28,88,131 యూనిట్లకు చేరాయి, గత ఏడాది ఇదే కాలంలో 22,42,139 యూనిట్లుగా ఉన్నాయి.ప్రయాణికుల వాహనాల రిటైల్‌ విక్రయాలు 41 శాతం పెరిగి 3,25,645 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల్లో 51 శాతం వృద్ధితో 15,71,165 యూనిట్లు, వాణిజ్య వాహనాల విక్రయాలు 25 శాతం ఎగబాకి 74,443 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాల్లో 66 శాతం, ట్రాక్టర్‌ అమ్మకాలు 17 శాతం పెరిగాయి.