Site icon HashtagU Telugu

Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ. 20 వేలు ఆదా.. రూ. 200తో నెలంతా తిరిగొచ్చట!

Mixcollage 03 Jul 2024 07 51 Am 9153

Mixcollage 03 Jul 2024 07 51 Am 9153

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. అందుబాటు ధరలోనే అదిరిపోయే ఫీచర్స్ తో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం వల్ల ఏటా భారీగానే డబ్బులు ఆదా చేసుకోవచ్చట. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు రిజ్‌టా. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 159 కిలోమీటర్లు వెళ్లవచ్చట. అయితే ఇది ఐడీసీ రేంజ్. అంటే రోడ్డుపై రేంజ్‌లో మార్పులు ఉండవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.

అలాగే కంపెనీ బ్యాటరీపై 5 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏకంగా 2500 కు పైగా ఫాస్ట్ చార్జింగ్ పాయింట్ల ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని లుక్ కూడా అదిరింది. వైడ్ పిల్లియన్ బ్యాక్‌రెస్ట్, 56 లీటర్ల స్టోరేజ్ స్పేస్ మల్టీ పర్పస్ చార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్లు, ట్యాబ్లెట్స్, స్పీకర్లు వంటివి చార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఆటో హోల్డ్ ఫీచర్ కూడా ఉంది. బ్రేక్ వేయకుండానే వాలుగా ఉన్న రోడ్లపై కూడా స్కూటర్‌ను నిలుపుదల చేయవచ్చు. రివర్స్ మోడ్ కూడా ఉంది. రియర్ మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఈజీ రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. స్కిడ్ కంట్రోల టెక్నాలజీ కూడా అమర్చారు. అలాగే ఇందులో లైవ్ లొకేషన్ షేర్ చేయవచ్చు.

టౌ అండ్ థెఫ్ట్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. పింగ్ మై స్కూటర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ఫాల్‌ సేఫ్, టర్న్ బై టర్న్ డైరెక్షన్లు, రియల్ టైమ్ ట్రాఫిక్ వ్యూ, టూవీలర్ రూట్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యాష్ బోర్డులో వాట్సాప్ అలర్ట్స్, అలెక్సా వంటివి కూడా ఉన్నాయి. కాగా ఈ స్కూటర్ ధర రూ.1,09,999 నుంచి ప్రారంభం అవుతోంది. మీరు రోజుకు 30 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటే ఈ స్కూటర్ కొనడం వల్ల ఏడాదికి రూ. 20 వేల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే ఎఫ్​డీలలో నగదు డిపాజిట్లు,, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, స్టాక్స్​లో పెట్టుబడులు, ఫోరెక్స్ కార్డులు మొదలైన విదేశీ కరెన్సీ కొనుగోళ్లకు కూడా రూ.10 లక్షల పరిమితి వర్తిస్తుంది. నెలకు 25 రోజుల ప్రాతిపదికన ఇక్కడ పరిగణలోకి తీసుకున్నా, పెట్రోల్ వెహికల్ మైలేజ్ లీటరుకు 40 కిమి అనుకున్నా,యూనిట్‌కు ఎలక్ట్రిసిటీ ఖర్చు రూ.10 ఒక యూనిట్ ద్వారా 35 కి.మి వరకు వెళ్లవచ్చని కంపెనీ పేర్కొంది.

Exit mobile version