Site icon HashtagU Telugu

Chat GPT In Cars : ఈ కార్ల స్టీరింగ్‌లో ‘ఛాట్ జీపీటీ’ ఫీచర్.. ఇక ఎంతో కంఫర్ట్

Chat Gpt In Cars

Chat Gpt In Cars

Chat GPT In Cars : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యుగమిది. ఏఐ చాట్‌బాట్లకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ప్రఖ్యాత  ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ గురించి తెలియనిది ఎవరికి !! టెస్లా వంటి పలు కార్ల కంపెనీలు ఇప్పటికే ఏఐని వినియోగంలోకి దూసుకుపోతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కార్ల తయారీ దిగ్గజం వోక్సవ్యాగన్ కూడా ఎంటరైంది. ఓపెన్ ఏఐ కంపెనీ తయారు చేసిన చాట్ జీపీటీని(Chat GPT In Cars) తన కార్లలో పరిచయం చేసేందుకు వోక్సవ్యాగన్ రెడీ అవుతోంది. కార్లలోని ఛాట్ జీపీటీ సర్వీసు సాయంతో ఎయిర్ కండీషనర్‌ వర్కింగ్ లెవల్స్‌ను అడ్జస్ట్ చేయడం,  వాయిస్ కమాండ్లను ఇవ్వడం వంటివి చేయొచ్చు. కేవలం నోటి మాటతోనే ఈ టాస్క్ అంతా పూర్తి అయిపోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: 1100 Jobs : ఈసీఐఎల్‌లో 1100 జాబ్స్.. జూనియర్ టెక్నీషియన్స్‌కు గ్రేట్ ఛాన్స్

“చాట్‍ జీపీటీ వాడడం ప్రారంభించిన దగ్గరి నుంచి నేను దానికి కొంత బానిసనయ్యా” అని ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ ఇటీవల అన్నారు. అదానీ మాత్రమే కాదు ప్రపంచమంతా ప్రస్తుతం చాట్ జీపీటీ గురించే చర్చ జరుగుతోంది. లాంచ్ అయిన మూడు నెలల్లోనే మిలియన్ల మంది యూజర్లు దీనిని వినియోగిస్తున్నారు. దీంతో టెక్నాలజీ రంగంలో ఇదో సంచలనంగా మారింది. చాట్ జీపీటీని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. సెర్చ్ ఇంజిన్ గూగుల్‍కు కూడా ఈ ఏఐ చాట్ బాట్ ‘చాట్ జీపీటీ’ సవాలు విసురుతోంది. ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తీసుకొచ్చిన ఈ చాట్ జీపీటీ టెక్ రంగంలో పెనుమార్పులకు కారణమవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.