Gogoro : మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. బ్యాటరీ స్వాపింగ్‌తో పాటు మరెన్నో ఫీచర్స్..

అధునాతన బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో గొగోరో క్రాస్ ఓవర్ జీఎక్స్250 (Gogoro crossover GX250) పేరిట దీనిని పరిచయం చేసింది.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 08:40 PM IST

Gogoro Cross Over GX250 Electric Scooter : రోజురోజుకీ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న డిమాండ్, క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుండటంతో ఆయా బైక్ తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు అధునాతన, అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో పూర్తి మేడిన్ ఇండియా ఉత్పత్తిగా గొగోరో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. అధునాతన బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో గొగోరో క్రాస్ ఓవర్ జీఎక్స్250 (Gogoro crossover GX250) పేరిట దీనిని పరిచయం చేసింది. ఇది స్కూటర్ లలో ఎస్‌యూవీ టైప్ అని కంపెనీ పేర్కొంది. దీనిని మహారాష్ట్ర లోని ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇది అనువైన బడ్జెట్లోనే దీనిని అందిస్తున్నారు. కాగా ఈ గొగోరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం భారత్ లో గ్రిడ్ చార్జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని గంటల పాటు స్కూటర్ ను పార్క్ చేసి ఉంచి చార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గొగోరో ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ఈ స్కూటర్ లో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. అంటేస్వాపింగ్ స్టేషన్ కు వెళ్లి మీ బ్యాటరీని చార్జింగ్ కోసం అక్కడ ఉంచి ఫుల్ చార్జ్ అయిన మరో బ్యాటరీని తెచ్చుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు రైడర్ కు సౌలభ్యం కూడా దొరకుతుంది. తైవాన్ లో ఈ కంపెనీ తన నెట్ వర్క్ ను విస్తరించి. 6,00,000 రైడర్లకు గానూ 1.3 మిలియన్ స్మార్ట్ బ్యాటరీలను అందిస్తోంది.

దాదాపు 2,500 సెంటర్లలో 12,000 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను సమకూర్చింది. ఈ స్టేషన్లలో చక్కగా బ్యాటరీలు మార్చుకునే వీలుంటుంది. ఒక్క తైవాన్ లోనే రోజూ 4,00,000 బ్యాటరీలను రైడర్లు స్వాప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిని ఇప్పుడు మన దేశంలో కూడా విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, గోవా, ముంబై, పూణేలలో 2024 ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి స్వాపింగ్ స్టేషన్లను తీసుకురావాలని చూస్తోంది. కాగా గొగోరో క్రాస్ ఓవర్ జీఎక్స్250 (Gogoro crossover GX250) ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు రెండు మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. అవి ఒకటి క్రాస్ ఓవర్ 50, క్రాస్ ఓవర్ ఎస్ మోడల్స్.

వీటిల్లో క్రాస్ ఓవర్ జీఎక్స్ 250 ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో మిగిలిన రెండు మోడళ్లు అందుబాటులోకి రానుంది. ఈ క్రాస్ ఓవర్ స్కూటర్ లో 2.5కేడబ్ల్యూ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ ఉంటుంది. గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించగలుతుంది. సింగిల్ చార్జ్ పై 111 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ కు అధిక కార్డో వెసిలిటీ ఉంటుంది. దీనిలోని వెనుక సీట్ ఫ్లిప్ చేయవచ్చు. అలాగే పూర్తిగా తీసేయవచ్చు. పూర్తిగా తీసేసి కార్గో స్టోరేజ్ కోసం వినియోగించుకోవచ్చు.

Also Read:  Phone Overheating: స్మార్ట్ ఫోన్ పదేపదే వేడెక్కుతోందా.. అయితే ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే?