SUV: ఆర్మీ ట్యాంక్స్ లాంటి ఫీచర్స్ తో ఎస్ యూవి కార్.. ఇండియాలో ఈ కార్ ధర ఎంతో తెలుసా?

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 06:20 PM IST

తాజాగా అమెరికాలోని కార్నిఫోలియాలో రెజ్వానీ అనే ఒక కంపెనీ ఒక స్పెషల్ ఎస్‌యూ‌వి ని లాంచ్ చేసింది. దానిని రెజ్వాని వెంజియన్స్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఎస్‌యూ‌వి లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఫీచర్స్ అన్నీ కూడా ఆర్మీ ట్యాంక్స్ లో ఉంటాయి. కాగా ఈ ఎస్‌యూ‌వి కార్ ఫీచర్స్, ధర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రెజ్వానీ వెంజియన్స్‌లో..కొలిజన్ అలెర్ట్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, ఆఫ్ గ్రిడ్ సోలార్ లాంటి ఫీచర్లు ఇందులో లభించనున్నాయి.

కేవలం ఇవే కాకుండా మిలిటరీ గ్రేడ్ ప్యాకేజీలో ఈ ఎస్‌యూ‌వి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అండ్ బాడీ ఆర్మర్, ఫ్లాట్ రన్ మిలిటరీ టైర్లు, థర్మల్ నైట్ విజన్ సిస్టమ్, రీ ఫోర్స్ సస్పెన్షన్ సిస్టమ్,అండర్ సైడ్ ఎక్స్‌ప్లోజివ్ ప్రొటెక్షన్, స్మోక్ స్క్రీన్, ఎలక్ట్రో మాగ్నెటిక్ పల్స్ ప్రొటెక్షన్, రామ్ బంపర్‌ లు అంటే అత్యాధునిక, అద్భుతమైన ఫీచర్లు ఈ కారులో కలవు. అంతేకాకుండా పేలుడు పలకరాన్ని గుర్తించే ఆప్షన్ అదే విధంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అండ్ హెల్మెట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎస్‌యూ‌వి కార్ లో ఆర్మీ వాహనం వంటి ఫీచర్స్ తో ఇంజిన్ కూడా చాలా శక్తివంతమైనది.

ఇందులో కంపెనీ మూడు ఇంజన్ల ఆప్షన్స్ ఇచ్చింది. అలాగే ఇందులో ఏడు అండ్ ఎనిమిది మంది కూర్చునే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూ‌వి లోపలి భాగంలో చాలా లగ్జరీ టచ్ ఇచ్చారు. 12 వే పవర్ ఫ్రంట్ సీట్లు అలాగే హీటెడ్ సీట్లు పొందుతుంది. అలాగే 19 స్పీకర్లతో కూడిన అద్భుతమైన టచ్ OLED ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా ఉన్నాయి. ఇకపోతే ఈ ఎస్‌యూ‌వి కారు ధర ఇండియాలో ఎంత ఉంది అన్న విషయానికి వస్తే.. కంపెనీ ఈ ఎస్‌యూ‌వి ప్రారంభ ధరను యూ‌ఎస్ $2.5 లక్షలగా నిర్ణయించింది. అనగా మన ఇండియన్స్ కరెన్సీ ప్రకారం భారతీయ రూపాయలలో దాదాపు రూ. 2.04 కోట్లు. దీని గరిష్ట ధర రూ. 5.17 కోట్ల వరకు ఉంటుందట.