Site icon HashtagU Telugu

Alto 800 Maruti Suzuki: “ఆల్టో 800” అల్ విదా.. ఉత్పత్తి ఆపేసిన మారుతీ సుజుకీ

Maruti Alto

Maruti Alto

Alto 800 Maruti Suzuki : మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటూ ఎక్కువగా అమ్ముడవుతున్న ఎంట్రీ లెవెల్ మోడల్ కారు “ఆల్టో 800” తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కారణమేంటో ఇప్పుడు చూద్దాం.

ఇక మనం Alto 800 కారు కొనలేమన్నమాట. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి కొత్త వాహన ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనిలో భాగంగా కొన్ని పరికరాలను కారులో ఇన్‌స్టాల్ చేయాల్సి వస్తుంది.భారత్ స్టేజ్ ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800 కారును అప్‌గ్రేడ్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నదని మారుతీ సుజుకీ ప్రకటించింది. అందుకే ఇకపై దీని తయారీని డిస్‌కంటిన్యూ చేయనున్నట్లు పేర్కొంది. అప్‌గ్రేడ్ చేసినా.. అది తమకు ఆర్థికంగా లాభదాయకం కాదని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తయారీ నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

మారుతీ సుజుకీ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ సిగ్మెంట్ ఆల్టో 800 కొనుగోళ్లు తగ్గుముఖం పడుతున్నాయని, వాహనాల కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ఇంకా రోడ్ టాక్స్, మెటీరియల్ కాస్ట్, ఇతర పన్నులు వసూలు చేయడం కూడా ఈ ఆల్టో కారు కొనుగోలు ఖర్చులు పెరిగేందుకు కారణమని ఆయన అన్నారు. ఇక ఆల్టో కె10కు డిమాండ్ పెరగడం కూడా ఆల్టో 800 తయారీని నినిలిపివేయడానికి ఒక కారణంగా అనుకుంటున్నారు.

ఇక Alto K10..

మారుతీ సుజుకీ ఆల్టో 800 తయారీ నిలిపివేస్తే గనుక అప్పుడు ఇక ఆల్టో k10 తన ఎంట్రీ లెవెల్ మోడల్ అవుతుంది. దీని ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.94 లక్షల మధ్య ఉంది. ఇది దిల్లీ ఎక్స్‌షోరూం ధర. ఇక ఆల్టో 800 ధర విషయానికి వస్తే దిల్లీ ఎక్స్‌షోరూంలో ప్రారంభ ధర రూ.3.54 లక్షలు కాగా.. గరిష్టంగా రూ.5.13 లక్షలుగా ఉంది.

Alto 800 ఫీచర్స్..

  1. ఇందులో 796cc పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.
  2. ఇది 48PS మ్యాగ్జిమం పవర్, 69 Nm టార్క్‌ను జనరేట్ చేస్తోంది.
  3. ఈ మోడల్ ఇండియాలో 2000 సంవత్సరంలో లాంచ్ అయింది.
  4. 2010 వరకే ఏకంగా 18 లక్షల యూనిట్లను విక్రయించింది.
  5. ఇక అప్పటినుంచి మరో 17 లక్షల ఆల్టో 800 మోడల్ కార్లను అమ్మగా.. ఇదే సమయంలో ఆల్టో k10 యూనిట్లు 9 లక్షల 50 వేలు అమ్ముడయ్యాయి.

Also Read:  E. Coli in Keema Meat: ఖీమా మాంసంలోని E. Coli తో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గండం!