Tyre Punctures: కార్ల టైర్లు ఎన్ని పంక్చర్ల తర్వాత మార్చాలి.. ట్యూబ్,ట్యూబ్‌లెస్ టైర్ల మధ్య ఇదే?

మామూలుగా మనం కారును వినియోగిస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కారు టైర్లు పంక్చర్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా కార

  • Written By:
  • Publish Date - February 25, 2024 / 07:30 PM IST

మామూలుగా మనం కారును వినియోగిస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కారు టైర్లు పంక్చర్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా కారు టైరు పంక్చర్ అవ్వగానే వెంటనే మనం స్టెఫీనీ ని ఉపయోగిస్తూ ఉంటాము. లేదంటే దగ్గర్లో ఉన్న పంక్చర్ షాప్ కి వెళ్లి దానిని రిపేర్ చేయించుకుంటూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో రహదారులు సరిగ్గా లేని కారణంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లేందుకు రోడ్లు సరిగా ఉండదు. అలాంటప్పుడు తరచూ కారు టైర్ పంక్చర్ అవుతుందనే భయం ఎప్పుడూ ఉంటుంది. కానీ చాలా మంది వాహన యజమానులు తరచూ టైర్లను రిపేరు చేస్తూ ఉంటారు.

అయితే అలాంటి అరిగిపోయిన టైర్ ఎంతకాలం ఉంటుందో గ్యారెంటీ లేదు. పంక్చర్ అయిన టైరు ఎన్ని సార్లు రిపేర్ చేయాలో? కూడా చాలామందికి తెలియదు. మరి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కారు మొత్తం బరువు టైర్లపైనే ఉంటుంది. రోడ్డు మధ్యలో కారు ఆగిపోకుండా ఉండాలంటే టైర్లు మంచి ఆకృతిలో ఉండాలి. కానీ తరచూ రోడ్డుపై టైర్లు పంక్చర్ అవుతుంటాయి. కానీ మీరు తరచుగా టైర్ పంక్చర్‌ లను చేయిస్తుంటే, ఇప్పటికీ అదే వాటిని ఉపయోగిస్తుంటే, ఇది మీకు హెచ్చరికగా కావచ్చని గుర్తించుకోవాలి.. పంక్చర్ అయిన తర్వాత ట్యూబ్ టైర్‌లోని గాలి వెంటనే బయటకు వస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్లు గాలిని ఎక్కువసేపు పట్టుకుంటుంది.

కానీ ట్యూబ్ టైర్ రెండు మూడు సార్లు పంక్చర్ అయితే ట్యూబ్ త్వరగా అరిగిపోతుంది. పంక్చర్ చేసేటప్పుడు బ్యాండేజ్ లాంటిది వేస్తుంటారు. తరచుగా ఈ స్ట్రిప్ కూడా వస్తుంది. ఇది ట్యూబ్‌ను దెబ్బతీస్తుంది. టైర్‌లో కొత్త ట్యూబ్‌ను మార్చడం అవసరం. అలాగే ట్యూబ్ లెస్ టైర్ పంక్చర్ అయితే అందులోని గాలి చాలా సేపు అలాగే ఉంటుంది. గోరు దానిలోకి తగిలినా లేదా చిన్న వస్తువు పంక్చర్ అయినట్లయితే, కారు డ్రైవర్ దానిని స్వయంగా రిపేర్ చేయవచ్చు. ఈ టైర్లను రిపేర్ చేయడం కూడా సులభం. కానీ పంక్చర్ అయిన టైర్ బాగా పాడైపోయినట్లయితే, అప్పుడు ట్యూబ్, టైర్ మార్చాలి. టైరు ఎక్కువగా వాడితే త్వరగా పంక్చర్ అవుతుంది. టైర్లు తరచుగా పంక్చర్ అవుతాయి .కానీ పంక్చర్ తొలగించిన తర్వాత తరచుగా ఉపయోగిస్తుంటారు. ఇలా పదేపదే పంక్చర్‌ చేయడం వల్ల కూడా ఖర్చు బాగానే ఉంటుంది. ఒక టైరు నిరంతరం పంక్చర్ చేయబడితే అది పాడైపోతుంది. అలాంటి టైర్లు పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ టైర్లు 3-4 సార్లు లేదా అంతకంటే ఎక్కువ పంక్చర్ అయితే టైర్లను మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. రెండు పంక్చర్ల మధ్య దూరం 150 మిమీ కంటే తక్కువగా ఉంటే, టైర్‌ను మార్చడం సముచితంగా పరిగణించబడుతుంది.

Follow us