Site icon HashtagU Telugu

Diesel Vehicles: డీజిల్ వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ..? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే..?

Diesel Vehicles

Gadkari

Diesel Vehicles: డీజిల్ వాహనాల (Diesel Vehicles)పై అదనంగా 10 శాతం జీఎస్టీ పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వంలోని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాల వైపు చాలా మంది కార్ల కొనుగోలుదారులను మళ్లించడం దీని ఉద్దేశం. నితిన్ గడ్కరీ ఈ పన్నుకు కాలుష్య పన్ను అని పేరు పెట్టారు. గడ్కరీ ప్రకారం.. దేశంలో డీజిల్ వాహనాలను తగ్గించడానికి ఇది ఏకైక మార్గం. డీజిల్ ఇంజిన్ వాహనాల తయారీని తగ్గించాలని ఆటోమొబైల్ పరిశ్రమను అభ్యర్థిస్తున్నామని, లేకుంటే ఈ పన్నును అమలు చేయాల్సిన అవసరం వస్తుందని గడ్కరీ తెలిపారు. దీని కారణంగా ఈ వాహనాల విక్రయంలో సమస్యలను ఎదుర్కోవచ్చని అన్నారు.

అయితే, 2014 నుండి పెట్రోల్/డీజిల్ సవరించిన ధరల కారణంగా దేశీయ మార్కెట్లో డీజిల్ ఇంజిన్ వాహనాల అమ్మకాలు క్షీణించాయి. గత ఆర్థిక సంవత్సరం గురించి చెప్పాలంటే.. ఈ వాహనాల మొత్తం అమ్మకాలలో డీజిల్ ఇంజిన్ వాహనాల సంఖ్య 18% ఉంది. ఇది FY14లో 53%గా ఉంది. SIAM 63వ వార్షిక కాన్వొకేషన్‌లో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డీజిల్‌తో నడిచే ఇంజన్‌లపై (కార్లు, అన్ని జనరేటర్లు) 10 శాతం అదనపు పన్ను విధించాలని ఈ సాయంత్రం ఆర్థిక మంత్రికి లిఖితపూర్వకంగా ప్రతిపాదన చేయబోతున్నాను అని పేర్కొన్నారు.

Also Read: TDP in camera :చంద్ర‌బాబు కుర్చీలో నేడు బాల‌య్య! నాడు దేవేంద‌ర్ గౌడ్!! 

63వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) కన్వెన్షన్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డీజిల్ ఇంజన్లు/వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించనున్నట్లు తెలిపారు. డీజిల్ వాహనాలు అత్యంత కాలుష్యాన్ని కలిగిస్తాయని, రోడ్డుపై వాటి సంఖ్య తక్కువగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు.

“నేను గత 10-15 రోజులుగా ఒక లేఖను సిద్ధం చేశాను. ఈ సాయంత్రం నేను ఆ లేఖను ఆర్థిక మంత్రికి సమర్పిస్తాను. అందులో డీజిల్ వాహనాలు, అన్ని డీజిల్ ఇంజిన్లపై అదనంగా 10% GST విధించే ప్రతిపాదన ఉంది.” అన్నారు. అయితే, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ యాక్టివ్‌గా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

గత 9 ఏళ్లలో డీజిల్ కార్ల వాటా 2014లో 335% ఉండగా ఇప్పుడు 28%కి తగ్గిందని ఆయన చెప్పారు. డీజిల్ ఇంజిన్‌ల వల్ల పర్యావరణానికి కలిగే హాని గురించి ఆయన చెప్పారు. కాలుష్యం, కార్బన్ ఉద్గారాలను అరికట్టడం గురించి కూడా మాట్లాడారు. డీజిల్ వాహనాలపై పన్ను పెంచడం ద్వారా వాటి ఉత్పత్తి, విక్రయాలు తగ్గుతాయని, దీనివల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు.