Rusty Car – 15 Crore : ఆ కారు తుక్కుదే .. అయినా రేటు మాత్రం ఎక్కువే !!
టైర్లు ఊడిపోయి.. ఎక్కడికక్కడ కాలిపోయి.. తుక్కుతుక్కుగా మారిన ఆ రేసు కారును ఒక ఔత్సాహికుడు ఏకంగా రూ.15 కోట్లకు కొన్నాడు..
వేలంపాటలో అతడు చెప్పిన రేటును విని.. తుక్కు కారును అమ్మే వాళ్లు కూడా వామ్మో అన్నారు..
Also read : Aasara Pension Rs 3016 : ఆసరా పింఛను రూ.3,016కు పెంపు.. త్వరలో ఉత్తర్వులు ?
ఇంత ధరను పలికిన ఆ కారు ‘ఫెరారీ 500 మాండియల్ స్పైడర్ సిరీస్-1’ మోడల్ కు(Rusty Car – 15 Crore) చెందినది.. తుక్కుగా మారిన ఆ కారును అమెరికాలోని కాలిఫోర్నియాలో ‘ఆర్‌ఎం సోథిబే’ సంస్థ వేలం వేసింది.. దీన్ని ఈ వేలంలో రూ.15 కోట్లకు కొన్న వ్యక్తి.. కారును బాగు చేయించి మళ్లీ రేసింగ్ ట్రాక్‌పై పరుగులు పెట్టిస్తానని చెప్పాడు. ఇది ఎందుకు స్పెషల్ అంటే.. ఇటాలియన్ రేసింగ్ డ్రైవర్ అల్బెర్టో అస్కరీ 1952, 1953ల్లో ‘ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్’లో సాధించిన విజయాలకు స్మారకంగా ఫెరారీ సంస్థ ఈ రేస్ కారును అప్పట్లో తయారు చేసింది. ప్రఖ్యాత ఇటాలియన్ డిజైన్ సంస్థ ‘పినిన్ ఫరీనా’ ఈ కారు బాడీని రూపొందించింది. అప్పట్లో ఫెరారీకి మొట్టమొదటి రేసింగ్ విజయాన్ని అందించిన డ్రైవర్ ఫ్రాంకో కోర్టేస్.. 1954లో ఈ కారును కొన్నారు. 1958లో ఇది అమెరికాకు తరలిపోయింది. 1960ల్లో ఓ రేసులో ప్రమాదానికి గురైన ఈ కారు మంటల్లో కాలిపోయింది. 1978 వరకు చేతులు మారుతూ వచ్చింది. ఆ తర్వాత ఓ వ్యక్తి దాన్ని కొని 45 ఏళ్లపాటు ఓ మూలన దాచిపెట్టడంతో ఇలా తయారైంది.