ఇటీవల కాలంలో కార్ల వినియోగం చాలా వరకు పెరిగిపోయింది. మరి ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా బడ్జెట్ కార్ల వైపే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దాంతో కార్లు తయారీ సంస్థలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలో ఉన్న కార్లను విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ కార్లలో సూపర్ ఫీచర్లను కూడా అందిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే కారు కూడా ఒకటి. రూ. 6 లక్షల్లోనే 7 సీటర్ కారు. వినడానికి చాలా బాగుంది కదూ.
మరి ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ ఇంజన్ 96ఎన్ఎమ్ టార్క్, 72పీఎస్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే మైలేజ్ విషయానికొస్తే.. ఈ కారు లీటర్‌కు 18.9 నుంచి 19 కిలో మీటర్లు ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్స్ లో తీసుకొచ్చారు. ఇక ఈ కారులో 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లను కూడా అందించారు. ప్రస్తుతం మార్కెట్లో రోజు రోజుకీ 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది పెద్ద కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే 7 సీటర్ కారు అనగానే ఎక్కువ బడ్జెట్ ఉంటుందనే విషయం తెలిసిందే. పెద్ద కారు కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కు రూ. 8 లక్షలైనా పెట్టాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్లో ఈ 7 సీటర్ కారు అందుబాటులో ఉంది. అది ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ నుంచి వచ్చి 7 సీటర్ ట్రైబర్ కారుకు మంచి ఆదరణ లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ బేసిక్ వేరియంట్ ధర సుమారు రూ. 5.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక టాప్ ఎండ్ విషయానికొస్తే.. ఈ కారు ధర సుమారు రూ. 8.12 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైజ్‌తో లభిస్తోంది. ఇందులో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను అందించారు. ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ వేరియంట్ తో ఈ కారును తీసుకొచ్చారు. అలాగే ఇందులో ఎల్ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ యాక్సెస్ కార్డ్, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, LED DRLలతో ప్రొజెక్టర్ హ్యాండ్‌ల్యాప్, 6 వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్ కూల్డ్ స్టోరేజ్, 182mm అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో అందించారు. ఇక భద్రత విషయానికొస్తే ఈ కారులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు 2 ముందు, 2 వైపు ఉన్నాయి. గ్లోబల్ NCAP ఈ కారుకు పెద్దలకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది.