Site icon HashtagU Telugu

Enigma: త్వరలో హై స్పీడ్ ఎలక్ట్రానిక్ టూ వీలర్.. ధర ఫీచర్స్ ఇవే?

Enigma

Enigma

గడిచిన ఒకటి రెండు ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా ఇప్పటికే ఎన్నో ద్విచక్ర వాహనాలు మార్కెట్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ కార్లు ఇలా రకాల వాహనాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇది ఇలా ఉంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి ఒక చక్కటి శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎనిగ్మా త్వరలో ఆరు హై స్పీడ్‌ టూ వీలర్ లను ప్రవేశపెట్టనుంది.

ఈ ఏడాది ఆఖరు నాటికి ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ అన్మోల్‌ బోహ్రీ తెలిపారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలిగే కెఫే రేసర్‌, ఎనిగ్మా సీఆర్‌22 వీటిలో ఉండనున్నట్లు వివరించారు. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 105 కి.మీ. రేంజ్ ఇస్తుందని వెల్లడించారు. కాగా సింగపూర్‌లో ట్రేడయ్యే నిఫ్టీ సూచీ పేరు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నుంచి గిఫ్ట్‌ నిఫ్టీగా మారనుంది. జూలై 3 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ తెలిపింది.

ఎస్‌జీఎక్స్‌ ఆర్డర్లు అన్నీ మ్యాచింగ్‌ కోసం గిఫ్ట్‌ సిటీలోని ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్స్ఛేంజ్ కి బదలాయించనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఎన్‌ఎస్‌ఈ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సెంటర్‌ ఎక్స్ఛేంజీ ఉంది. కాబట్టి వేగవంతమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కావాలి కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారు మరికొద్దిలో రోజులు ఆగాల్సిందే.

Exit mobile version