Electric Vehicle : 5 రూపాయ‌ల‌తో 60కిలోమీట‌ర్లు న‌డిచే ఎల‌క్ట్రిక్ బండి త‌యారుచేసిన కేర‌ళ వ్య‌క్తి..

పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఫ్యూచ‌ర్ అంతా ఎల‌క్ట్రిక్ బండ్ల హ‌వానే.

  • Written By:
  • Publish Date - April 15, 2022 / 04:04 PM IST

పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఫ్యూచ‌ర్ అంతా ఎల‌క్ట్రిక్ బండ్ల హ‌వానే. అందుకే మార్కెట్లో పుట్ట‌గొడుగుల్లా ఎల‌క్ట్రిక్ బండ్ల త‌యారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ మ‌ధ్య కాలంలో ఎల‌క్ట్రిక్ బండ్లు పేలిపోవ‌డం, కాలిపోవ‌డంలాంటి సంఘ‌ట‌న‌ల‌తో అవి ఏమేర‌కు సుర‌క్షిత‌మ‌నే ప్ర‌శ్న మొద‌ల‌వుతోంది. ఈ నేప‌ధ్యంలో కేర‌ళ‌కు చెందిన 67 ఏళ్ల వ్య‌క్తి ఒక అద్భుతం సృష్టించాడు. త‌న ఇంట్లోనే కేవ‌లం 5 రూపాయ‌ల‌తో 60కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేసే ఎల‌క్ట్రిక్ బండిని త‌యారుచేశాడు.

కేర‌ళ‌ల‌లోని కొల్లంకు చెందిన 67 ఏళ్ల ఆంటోనీ జాన్ క‌న్స‌ల్టెంట్‌గా ప‌నిచేస్తున్నాడు. త‌న ఇంటి నుంచి ఆఫీస్‌కు 30కిలోమీట‌ర్ల దూరం. పెట్రోల్ రేట్లు అమాంతం పెరిగిపోతుండ‌డం, మార్కెట్‌లో దొరికే ఎల‌క్ట్రిక్ బండ్ల సేఫ్టీ మీద డౌట్ రావ‌డంతో ఆలోచించి ఇంట్లోనే ఒక ఎల‌క్ట్రిక్ బండి త‌యారుచేశాడు. 2018 నుంచి దీనిపై ఆలోచ‌న చేసిన ఆంటోనీ అప్ప‌టి నుంచి డిజైన్‌పై వ‌ర్క్ చేశాడు. త‌న ఇంటి ద‌గ్గ‌ర ఉన్న ఒక గ్యారేజీలో త‌న ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఒక బాడీ త‌యారుచేయించాడు. కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే ప‌ట్టేలా బ్యాట‌రీతో న‌డిచే కారు త‌యారుచేయాల‌న్న‌ది త‌న ఆలోచ‌న‌. ఢిల్లీ నుంచి బ్యాట‌రీలు తెప్పించి అప్పుడే వ‌ర్క్ స్టార్ట్ చేసినా క‌రోనా కార‌ణంగా అది నిలిచిపోయింది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీలో ఎక్స్‌పీరియ‌న్స్ లేక‌పోవడంతో ప్రాజెక్టు చేయ‌గ‌ల‌నా లేదా అనుకున్నాడు. లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో త‌న ద‌గ్గ‌రున్న బ్యాట‌రీల‌తో కారు త‌యారుచేశాడు. అయితే, అది అనుకున్నంత రేంజ్ ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌రో ర‌కం బ్యాట‌రీలు తెప్పించి ఎలాగైతేనేం స‌క్సెస్ అయ్యాడు.

ఆంటోనీ త‌యారుచేసిన కారు లీగ‌లేనా?

అతిత‌క్కువ ప‌వ‌ర్ రేటింగ్ ఉన్న కారు ఇది. అంటే గంట‌కు 25కిలోమీట‌ర్ల వేగం మాత్ర‌మే ప్ర‌యాణించ‌గ‌ల‌దు. అలాంటి వాహ‌నాల‌కు మ‌న దేశంలో రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు. అయితే, డ్రైవ‌ర్‌కి మాత్రం లైసెన్స్ ఉండాల్సిందే. ఈ ప్రాజెక్టుకు ఆంటోని నాలుగున్న‌ర ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చుపెట్టాన‌ని చెబుతున్నాడు.అతి త్వ‌ర‌లోనే మ‌రో మంచి డిజైన్‌తో ముందుకు వ‌స్తాన‌ని అంటున్నాడు ఆంటోనీ.