Site icon HashtagU Telugu

Motor cycle: మీ బైక్ కు మార్పులు చేస్తున్నారా.. అయితే ఈ రూల్స్ పాటించడం తప్పనిసరి.. లేదంటే?

Mixcollage 04 Dec 2023 05 00 Pm 7276

Mixcollage 04 Dec 2023 05 00 Pm 7276

మామూలుగా మనం ద్విచక్ర వాహనాలకు ఎవరికి నచ్చిన విధంగా వారు వారి సొంత వాహనాలకు మాడిఫికేషన్స్ చేయిస్తూ ఉంటారు. అయితే చిన్న చిన్న మార్పులను చేయించడం కామన్. అందులో బాగానే టైర్లు వీల్స్ అలాగే ఇతర కాంపోనెంట్స్ మార్చుకోవడం అన్నది సహజం. కానీ భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించి చేసే కొన్ని మోడిఫికేషన్ కు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలను నియమాలను నిర్దేశించింది. ఈ మార్పులు RTO రూల్స్‌ను అత్రికమించకూడదు. అయితే కొన్ని మైనర్ మాడిఫికేషన్స్‌కు మాత్రం అనుమతి ఉంటుంది. వీటిలో ఇంజిన్ బెల్లీ, డెకాల్స్, వైజర్స్, వింగ్‌లెట్స్ వంటివి ఉన్నాయి. అయితే ద్విచక్ర వాహనాలకు మార్పులు చేయించాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నిర్దేశించిన అని నియమాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి.ల్

ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెహికల్ యజమాని చేపట్టే ఆఫ్టర్‌ మార్కెట్ సైలెన్సర్ మార్పులు, హ్యాండిల్‌ బార్ మాడిఫికేషన్స్ వంటివి RTO నిబంధనలకు విరుద్ధం. బైక్‌లో ఇలాంటి మార్పులు లేదా సర్దుబాట్లు ఏవైనా చేస్తే, వాహన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించవచ్చు లేదా చట్టపరమైన చర్యలకు బాధ్యుల్ని చేయవచ్చు. కాబట్టి సైలెన్సర్ కి సంబంధించి హ్యాండిల్ కి సంబంధించి మోడిఫికేషన్ చేసే ముందు ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా రద్దు చేయవచ్చు. అయితే చట్టపరంగా చేయగలిగే ఐదు కామన్ మాడిఫికేషన్స్ ఏవి అన్న విషయానికొస్తే..

కొన్నిసార్లు బైక్‌కు స్టాక్ హెడ్‌లైట్స్ ఫెయిల్ అవుతాయి. లేదా రాత్రి సమయంలో సరైన లైటింగ్ ఇవ్వవు. దీంతో ఎక్కువ బ్రైట్‌నెస్ కోసం ఆక్సిలరీ లైట్లు మార్చుకోవచ్చు. చాలా తక్కువ పవర్‌తో పనిచేసే LED యాడ్ ఆన్స్ లీగల్ అయినప్పటికీ, మరీ ఎక్కువ బ్రైట్‌నెస్ అందించేవి మాత్రం వాడకూడదు. కొన్ని రాష్ట్రాలు అదనపు లైట్లను అనుమతిస్తాయి. ఉదాహరణకు పొగమంచు ఉన్నప్పుడు పసుపు లైటింగ్ సెట్ వాడటం లాంటివి. మోటార్‌ సైకిళ్లు అన్నీ మంచి పర్ఫార్మెన్స్ అందించే టైర్లతో వస్తాయి. అయితే కొంతమంది రైడర్లు ఇంకొంచెం బెటర్ ఎక్స్‌ పీరియన్స్ కావాలనుకుంటారు. అలాంటప్పుడు వారి ఆసక్తికి తగ్గట్టుగా టైర్లను మార్చుకోవచ్చు. రైడర్లు తమ బైక్ టైర్లను చట్టబద్ధంగా స్పోర్టియర్/స్టిక్కీయర్ మోడళ్లకు లేదా రోడ్ బయాస్డ్ వంటి వాటి నుంచి డ్యుయల్ పర్పస్‌ టైర్లుగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ సిఫార్సు చేసిన సైజ్‌కు అప్‌గ్రేడెడ్ టైర్లు లోబడి ఉండాలి. ఇన్‌-బిల్ట్ నావిగేషన్ ఉండని బైక్స్‌కు, ముఖ్యంగా పాత మోడళ్లకు మొబైల్ ఫోన్‌ను మోటార్‌సైకిల్‌కు స్టిక్ చేయడం కామన్. ఇందుకు ఫోన్ మౌంట్‌ను స్టాండ్‌గా వాడతారు.

అయితే నావిగేషన్ కోసం మొబైల్ ఫోన్ వాడే రైడర్లు మొబైల్ మౌంట్ యూజ్ చేయడం, మార్చుకోవడం లీగల్. అలాగే పబ్లిక్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఫోన్ మౌంట్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్లను వాడకూడదు. ఇప్పుడు వివిధ రకాల బైక్స్ విండ్‌ స్క్రీన్‌ తో వస్తున్నాయి. వీటిని ఎలాగైనా మార్చుకోవచ్చు. ఆఫ్టర్ మార్కెట్ విండ్‌ స్క్రీన్ అనేది లీగల్ యాడ్-ఆన్. కంపెనీలు సైతం అధికారిక యాక్సెసరీస్ లిస్ట్‌ లో వీటిని అందిస్తాయి. సస్పెన్షన్ ట్రావెల్‌ ను పెంచడం వంటి మాడిఫికేషన్స్ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అయితే గట్టి లేదా మృదువైన స్ప్రింగ్‌లతో ఇంటర్నల్స్‌ అప్‌గ్రేడ్ చేయడం, మోటార్‌సైకిల్‌కు సిఫార్సు చేసిన కంప్లీట్ రీప్లేస్‌మెంట్స్ అన్నీ చట్టపరంగా సరైనవే.