Site icon HashtagU Telugu

5 Car Accessories : మీ పాత కారును కొత్తగా చేసే 5 యాక్సెసరీస్

5 Car Accessories

5 Car Accessories

మీ కారు పాతబడిందా ? సెకండ్ హ్యాండ్ కారు కొన్నారా ? మీ కారును కొత్త లుక్ లో చూడాలని అనుకుంటున్నారా ? అయితే ఇంకెందుకు ఆలస్యం .. మేం 5 యాక్సెసరీలను(5 Car Accessories) వాడి మీ కారుకు కొత్త హంగును అద్దండి. అందరితో వావ్ అనిపించండి!! కారు లుక్ ను స్టైలిష్ గా మార్చడమే కాకుండా .. మీకు ఎంతో సౌకర్యాన్ని కూడా అందించే టాప్ 5 కార్ యాక్సెసరీల(5 Car Accessories) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ : స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మీ కారు కొత్తగా కనిపించేలా చేస్తుంది. ఈ స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌లు Android ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ (OS)ని కలిగి ఉంటాయి. వీటి ద్వారా Google Maps, Apple Car Play, Android Auto కనెక్టివిటీ, డయల్ ప్యాడ్, 4G ఇంటర్నెట్ సహా మరియు ఎన్నో ఫీచర్లను ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లలో కొన్ని భారీ 9కిపైగా అంగుళాల టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌తో వస్తాయి. ఇది మీరు పాత కారులో కొత్తదనాన్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది.

* రివర్స్ పార్కింగ్ కెమెరా : మీ పాత కారులో రివర్సింగ్ కెమెరాను అమర్చుకోవడం అనేది ఒక మంచి సౌలభ్యం. ఇది మీకు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. దీనివల్ల మీ కారు వెనుక వైపు జరిగే వాహనాలు కదలికలను స్పష్టముగా చూడగలుగుతారు. ఇరుకైన, రద్దీగా ఉండే ప్రదేశాలలోకి మీరు కారులో వెళ్ళినప్పుడు ఎంతో కంఫర్ట్ ఫీల్ అవుతారు. కావాలంటే మీ కారు ముందు భాగంలో కూడా పార్కింగ్ కెమెరాను మీరు అమర్చుకోవచ్చు.

also read : Summer: వేసవికాలంలో ఈ 5 విషయాలతో మీ కారుని రక్షించుకోండిలా?

* హెడ్ అప్ డిస్‌ప్లే : హెడ్-అప్ డిస్‌ప్లే అనేది డ్రైవర్ కారు ముందు భాగంలో చూసే ఫీల్డ్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శించడానికి రూపొందించబడిన భద్రతా వలయం. ఇది కారులో ఉండేలా ‘కూల్’ ఫీచర్‌గా పరిగణించబడుతోంది. మీ పాత కారుకు హెడ్-అప్ డిస్‌ప్లే యాక్సెసరీని జోడించడం వలన అది చాలా మోడర్న్ గా కనిపిస్తుంది. అంతేకాదు.. హెడ్ అప్ డిస్‌ప్లే మీ డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

* టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్: చాలా ఆధునిక కార్లు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)ని కలిగి ఉంటాయి. ఈ వ్యవస్థ మీ కారులోని ప్రతి టైర్ లో గాలి ఒత్తిడి ఎంత ఉందనేది డిస్ ప్లే చేస్తుంది. ఆ సమాచారం ఆధారంగా కారు టైర్లలో గాలిని మెయింటైన్ చేసే వీలు ఉంటుంది. లాంగ్ జర్నీ లో ఉన్నప్పుడు ఇది చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వల్ల మీ కారు అప్‌గ్రేడ్ చేసిన అనుభూతిని కలిగిస్తుంది.

* వైర్‌లెస్ ఛార్జర్: కొన్ని తాజా కార్ల యొక్క టాప్-స్పెక్ వేరియంట్‌లు వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ సాంకేతికతతో మీ మొబైల్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వైర్‌లెస్‌గా కారులో ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ చాలా హైటెక్‌గా కనిపిస్తుంది. ఇది ఏదైనా పాత కారుకు జోడించబడే సాధారణ ప్లగ్-అండ్-ప్లే అనుబంధం. ఈ ఫీచర్ సహాయకరంగా ఉండటమే కాకుండా డ్యాష్‌బోర్డ్‌లో తక్కువ వైర్‌లు అంటుకోవడంతో క్యాబిన్‌ను డీక్లటర్ చేస్తుంది.