Electric Bike: కేఫ్ రేజర్ ఎలక్ట్రిక్ బైక్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ.. పూర్తి వివరాలు ఇవే?కేఫ్ రేజర్ ఎలక్ట్రిక్ బైక్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ.. పూర్తి వివరాలు ఇవే?

దేశవ్యాప్తంగా ఇందన ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఎలక్ట్రిక్ వాహనా వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా నెలకి లక్షల సంఖ్యలో ఎల

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 06:15 PM IST

దేశవ్యాప్తంగా ఇందన ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఎలక్ట్రిక్ వాహనా వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా నెలకి లక్షల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. అయితే పెట్రోల్ గోడ లేకుండా ఎలక్ట్రిక్ వర్షంలో తక్కువ ధరకే దొరికే బైక్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆటమ్ వేడర్ మాత్రమే అని చెప్పవచ్చు. ఆటమ్ ఆటోమొబైల్ కంపెనీ భారత్ తొలి హైస్పీడ్ కేఫ్ రేజర్ ఎలక్ట్రిక్ బైక్ ఆటమ్ వీడర్ బైక్ ని లాంఛ్ చేసింది. క్లాసిక్ కేఫ్ రేజర్ స్టైల్ డిజైన్ తో వస్తోంది.

ఈ బైక్ 2.4 కిలోవాట్ పవర్ ఫుల్ మోటార్ తో, గంటకు 65 కి.మీ. టాప్ స్పీడ్ తో వస్తుంది. రీసౌర్స్ ఫుల్, లీక్ ప్రూఫ్, భద్రత కలిగిన బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. స్మూత్ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది ఈ బ్యాటరీ ప్యాక్. గంటకు 25 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే 100 +కి.మీ. రేంజ్ ఇస్తుంది. అదే గంటకు 45 కి.మీ. స్పీడ్ తో వెళ్తే 82+ కి.మీ. రేంజ్ ఇస్తుంది. పెట్రోల్ బైక్ కి ఆయిల్ ట్యాంక్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ కి కూడా ఒక స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. ఇందులో బ్యాటరీ ఛార్జర్ పెట్టుకోవచ్చు. 25 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఈ బైక్ 100 కిలోల లైట్ వెయిట్ కలిగి పోర్టబుల్ బ్యాటరీ, తక్కువ బరువుతో వస్తుంది.

సులువుగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ బయటకు తీసుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలానే ఈ బైక్ ని సర్వీసింగ్ చేయించాల్సిన అవసరం లేదు. సులువుగా మెయింటెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ తక్కువ మెయింటెనెన్స్ తో బైకులను తయారుచేస్తుంది. ఎక్కువ కాలం ఉండే స్పేర్ పార్ట్స్ తో తయారు చేస్తుంది. ఈ బైక్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేత సర్టి ఫై పొందింది. కాగా ఈ బైక్ మనకు ఎరుపు, తెలుపు, నలుపు, నీలం, బూడిద రంగుల్లో లభిస్తుంది. కాగా సదరు కంపెనీ ఈ బైక్ ఫ్రేమ్ మీద జీవితకాలం వారంటీ ఇస్తుంది. అలానే రూ. 36 వేల డిస్కౌంట్ కూడా ఇస్తుంది. డిస్కౌంట్ లేకుండా ఈ ఆటమ్ వేడర్ బైక్ ధర రూ. 1,36,000. ఆర్టీవో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కాకుండా రూ. 1,36,000. అయితే ఆటమ్ లైఫ్ (AtumLife) అనే యాప్ ద్వారా కొనుగోలుకే చేస్తే రూ. 36 వేలు తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ ఆటమ్ వేడర్ ఎలక్ట్రిక్ బైక్ రూ. లక్ష రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. రూ. 999తో ఈ బైక్ ని బుక్ చేసుకోవచ్చు. లేదు బైక్ వద్దనుకుంటే ఆరు నెలల్లో మీరు కట్టిన బుకింగ్ ఛార్జీని రిఫండ్ చేస్తుంది కంపెనీ. శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.