Site icon HashtagU Telugu

2024 TVS Jupiter 110: మార్కెట్ లోకి సరికొత్త టీవీఎస్​ జూపీటర్​ 110.. పూర్తి వివరాలివే!

2024 Tvs Jupiter 110

2024 Tvs Jupiter 110

భారత మార్కెట్లోకి ఇటీవల టీవీఎస్ జూపిటర్ 110 ఇటీవలే సరికొత్త అవతారంలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే వాస్తవానికి 2013లో మొదటిసారి ప్రయోగించిన తరువాత జూపిటర్​ స్కూటర్​ కి ఇది మొదటి అప్డేట్​ అని చెప్పాలి. కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లు, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కలిగిన సరికొత్త ఇంజిన్​తో 2024 జూపిటర్ 110 ధర రూ .73,700 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఈ సరికొత్త టీవీఎస్​ జూపిటర్ 110తో, కంపెనీ మరింత శక్తివంతమైన 113.5 సీసీ సింగిల్ సిలిండర్ మోటారును అమర్చింది. ఇది 8 బీహెచ్​పీ పవర్​, 9.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది మునుపటి మోడల్ కంటే పవర్​ని, టార్క్​ని పెంచే ఐగో అసిస్ట్ పర్ఫార్మెన్స్​ బూస్ట్ సిస్టమ్​తో వస్తుంది.

ఐగో అసిస్ట్ సిస్టెమ్​ ను ఐఎస్​జీ మోటార్, ఐఎస్​జీ కంట్రోలర్, బ్యాటరీతో అనుసంధానం చేశారు. కాగా 2024 జూపిటర్ 110లో సరికొత్త ఛాసిస్ ఉంది. టీవీఎస్ నాలుగు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. దీని టాప్​ ఎండ్​ వేరియంట్​ ఎక్స్ షోరూమ్ ధర రూ .87,250 వరకు ఉంది. కాగా టీవీఎస్ జూపిటర్ 110 బేస్ వేరియంట్​ని డ్రమ్ అని పిలుస్తారు. దీని ఎక్స్​షోరూం ధర రూ .73,700 గా ఉంది. డ్రమ్ బ్రేకులు, స్టీల్ వీల్స్​ తో ఈ వేరియంట్​ ను గుర్తించవచ్చు. లూనార్ వైట్ గ్లాస్, టైటానియం గ్రే మ్యాట్, మెటియోర్ రెడ్ గ్లాస్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటర్​ ముందు భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ లేనప్పటికీ, ఇది టర్న్ ఇండికేటర్లు, అనలాగ్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​ ని అందుకుంటుంది. ఇది కూడా ఇతర వేరియంట్ల మాదిరిగానే మెకానికల్స్​ ను పంచుకుంటుంది.

అదే 113.5 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్​ తో పనిచేస్తుంది. ఇతర వేరియంట్లలో ఐగో అసిస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ, డ్రమ్​లో లేదు. టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్​ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ప్రధానంగా దాని వీల్ డిజైన్ ద్వారా బేస్ వేరియంట్ కంటే భిన్నంగా ఉంటుంది. డ్రమ్ వేరియంట్​లో స్టీల్ వీల్స్, డ్రమ్ అల్లాయ్ 12 ఇంచ్​ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కాగా ఈ డ్రమ్ అల్లాయ్ వేరియంట్​లో స్టార్​లైట్​ బ్లూ గ్లాస్, లూనార్ వైట్ గ్లాస్, టైటానియం గ్రే మ్యాట్, మెటియోర్ రెడ్ గ్లాస్ అనే నాలుగు కలర్స్ లో లభించనుంది. ఈ బేస్ డ్రమ్ వేరియంట్ కంటే రూ.5,500 ఎక్కువ ధరతో ఈ జూపిటర్​ డ్రమ్​ లాయ్​ వేరియంట్​ రూ.79,200 ధరకు లభిస్తుంది.

టీవీఎస్ జూపిటర్ 110: డ్రమ్ స్మార్ట్​ఎక్స్​ఓనెక్ట్ వేరియంట్ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ కంటే ఎక్కువ ఫుల్-విడ్త్​ లైట్ బార్, బ్లూటూత్ కనెక్టివిటీతో ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఫైండ్ మి, ఫాలో మీ హెడ్ ల్యాంప్, అడ్వాన్స్డ్ ట్రిప్ సమ్మరీ, కార్బన్ సేవింగ్స్ ఇన్ఫర్మేషన్, మొబైల్ ఛార్జర్ వంటి అనేక కొత్త ఫీచర్లను జోడించింది. ఇది మనకు డాన్ బ్లూ మ్యాట్, గెలాక్టిక్ కాపర్ మాట్, స్టార్​లైట్​ బ్లూ గ్లోస్ వంటి కలర్స్లో లభించనుంది. దీని ధర ధర రూ.83,250 గా ఉంది. టీవీఎస్ జూపిటర్ 110 టాప్​ ఎండ్​ డిస్క్ స్మార్ట్​ఎక్స్​ఓనెక్ట్ వేరియంట్ ధర రూ .87,250 గా ఉంది. ఇది బేస్ డ్రమ్ ట్రిమ్ కంటే రూ .14,000 ఎక్కువ.