Site icon HashtagU Telugu

TVS: టీవీఎస్ నుంచి మరో కొత్త బైక్ రిలీజ్.. ఫీచర్స్ మాములుగా లేవుగా!

Tvs

Tvs

ఆటోమొబైల్ తయారీ సంస్థ టీవీఎస్ ఇప్పటికే ఎన్నో రకాల బైక్స్ ని మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందె. బడ్జెట్ ధర నుంచి హై రేంజ్ వరకు ఎన్నో రకాల బైకులను విడుదల చేసింది. ముఖ్యంగా ఎక్కువగా యువతనే టార్గెట్ చేస్తూ యువతకు నచ్చే విధంగా మంచి మంచి బైక్స్ ని మార్కెట్లోకి తీసుకు వస్తోంది టీవీఎస్ సంస్థ. ఇందులో బాగానే ఇప్పుడు మరో సరికొత్త లేటెస్ట్ బైక్ ని రిలీజ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ బైక్ ఫీచర్స్ విషయంలోనే కాకుండా ధర విషయంలో కూడా అదరహో అనిపిస్తోంది.

మరి తాజాగా విడుదల చేసిన ఈ టీవీఎస్ బైక్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. టీవీఎస్‌ నుంచి కొత్త బైక్‌ విడుదలైంది. ఈ కొత్త అపాచీ బైక్‌ కు కొత్త రంగు ఆప్షన్‌, రేసింగ్ రెడ్ జోడించింది. ఇదే కాకుండా బాంబర్ గ్రే కలర్ కూడా జోడించబడింది. ఇది బీఎండబ్ల్యూ జీ 310 RR, Keeway K300 R, కేటీఎం RC 390 వంటి బైక్‌ లతో పోటీ పడనుంది. ఈ మోటార్‌ సైకిల్‌లో 312 సీసీ , లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 9800 rpm వద్ద 38 bhp శక్తిని, 7900 rpm వద్ద 29 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త టీవీఎస్ Apache RR 310 ఇంజిన్, పవర్‌ ను నిర్వహించడానికి 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉంది.

దీనితో పాటు, ద్వి దిశాత్మక క్విక్‌ షిఫ్టర్‌ లు కూడా అందించింది. ఇకపోతే ఈ బైక్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ బైక్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇందులో అందించింది. ఈ మోటార్‌సైకిల్ నాలుగు రైడింగ్ మోడ్‌లలో వస్తుంది. ట్రాక్, అర్బన్, రెయిన్, స్పోర్ట్. దీని గరిష్ట వేగం గంటకు 215.9 కిలోమీటర్లు అని చెప్పవచ్చు.