Kwid vs Alto K10: రెనో క్విడ్-మారుతి ఆల్టో కే 10.. ఈ రెండింటిలో ఏది బెస్టో మీకు తెలుసా?

రెనో ఇండియా క్విడ్ హ్యాచ్‌బ్యాక్ 2024 మోడల్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కిగర్, ట్రైబర్ 2024 మోడల్స్ ను

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 03:30 PM IST

రెనో ఇండియా క్విడ్ హ్యాచ్‌బ్యాక్ 2024 మోడల్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కిగర్, ట్రైబర్ 2024 మోడల్స్ ను రెనో మార్కెట్లోకి తీసుకువచ్చాయి. కాగా ఈ క్విడ్ 2024 మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త క్విడ్ లో మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్ లను ఇంట్రడ్యూస్ చేశారు. క్విడ్ 2024 RXL వేరియంట్ ఇప్పుడు ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫీచర్‌ ఉన్న అత్యంత చవకైన హ్యాచ్‌బ్యాక్‌గా క్విడ్ నిలిచింది. అలాగే క్విడ్ ఈ వేరియంట్ ఇప్పుడు AMT గేర్‌ బాక్స్‌తో లభిస్తోంది.

ఇది ఇండియాలో అత్యంత సరసమైన ఆటోమేటిక్ కారుగా నిలిచింది. రెనో క్విడ్ లో 14 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. రెనో క్విడ్ ప్రధానంగా మారుతి సుజుకి ఆల్టో కే 10 తో పోటీపడుతోంది. ఆల్టో కే 10 చాలా కాలంగా భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా ఉంది. ఈ రెండు కార్ల మధ్య ప్రధాన మైన వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి. 2024 రెనో క్విడ్ ధర రూ. 4.69 లక్షల నుండి రూ. 6.12 లక్షల మధ్య ఉండగా, మారుతి సుజుకి ఆల్టో కె10 ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96 లక్షల మధ్య ఉంది. రెనో క్విడ్ RXL(O) AMT వేరియంట్ ధర రూ. 5.44 లక్షలుగా నిర్ణయించారు. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఆటోమేటిక్ కారుగా ఉంది.

అయితే, దీనికి అత్యంత సమీప పోటీదారు మారుతి సుజుకి ఆల్టో K120 VXI AGS. ధర రూ. 5.61 లక్షలుగా ఉంది. వీటి స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. లేటెస్ట్ రెనొ క్విడ్ పవర్‌ట్రెయిన్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. ఇందులో 67 బిహెచ్‌పి పీక్ పవర్, 91 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయగల 1.0-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, AMT యూనిట్ యొక్క ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. మారుతి సుజుకి ఆల్టో కె10 లో 1.0-లీటర్ కె10 సి పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. దీనిని ఆటో గేర్ షిఫ్ట్ లేదా AGS అని పిలుస్తారు. ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ 65 bhp గరిష్ట శక్తిని, 89 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. Alto K10 పెట్రోల్, పెట్రోల్-CNG ఇంధన ఎంపికలలో అందుబాటులో ఉంది. రెనో క్విడ్‌లో CNG ఆప్షన్ లేదు. పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, ఆల్టో కె10 కంటే క్విడ్ కొంచెం ఎక్కువ పవర్, ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.